Mobile Phone exploded In the Pocket:  తెలంగాణలోని కామారెడ్డిజిల్లాలో సెల్‌ఫోన్ పేలింది. ప్యాంట్‌జేబులోనే పేలింది. అయితే ప్రమాదంజరగడానికి ముందే ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌ను తీసి పక్కన పడేయడంతో పెద్ద ముప్పే తప్పింది. 


పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీలో ఉంటున్న సాయిలు ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ పేలింది. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ పని చేస్తున్న ఆయన రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చాడు. ఇంతలో తన ప్యాంటు జేబు భాగంలో ఏదో వేడిగా అనిపించింది. 


సెల్‌ఫోన్ హీట్ అవుతుందేమో అని గమనించి సెల్‌ఫోన్ తీస్తున్న క్రమంలోనే జేబు నుంచి పొగలు వచ్చాయి. తీసే లోపే సెల్‌ఫోన్ విపరీతంగా హీటెక్కి పేలిపోయింది. 




జేబులో పేలిన సెల్‌ఫోన్‌ కారణంగా ప్యాంట్ సగం కాలిపోయింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. దెబ్బకు ఆ వ్యక్తి వణికిపోయాడు. పెను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్నాడు. జీన్ ప్యాంటు కాకపోవడ, వదులుగా ఉన్న ప్యాంటు కావడంతో ప్రమాదం జరగలేదని అంటున్నారు. 


Also Read: బెట్టింగ్ వ్య‌స‌సానికి బానిసైన కొడుకు- అప్పులు తీర్చ‌లేక త‌ల్లిదండ్రుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం


Also Read: పెళ్లి చేయాలన్న భయంతో కుమార్తెను చంపేసిన తండ్రి -మెదక్ జిల్లాలో దారుణం