Chicken Rates : భారీగా తగ్గిన చికెన్ ధరలు, కరీంనగర్ లో రూ.100కే కిలో చికెన్

Chicken Rates : వరదల ప్రభావం, వచ్చేది శ్రావణ మాసం కావడంతో పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్ల ధరలు తగ్గించారు. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు అమాంతం దిగివచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.100లకే చికెన్ అమ్ముతున్నారు.

Continues below advertisement

Chicken Rates : వరుసగా కురుస్తున్న వర్షాలు అటు రైతులనే కాదు ఇటు పౌల్ట్రీ(Poultry) యజమానులను కూడా తీవ్రమైన చిక్కుల్లో పడేస్తున్నాయి. దీంతో కనీస ఖర్చుకి తగ్గట్టుగా పౌల్ట్రీ యజమానులు హోల్ సేల్ ధరలకే చికెన్(Chicken) షాపులకు కోళ్లను అమ్మేస్తున్నారు. చికెన్ ధర బాగా తగ్గడంతో మాంసప్రియులు ఎగబడి కొంటున్నారు. 

Continues below advertisement

వరదల ప్రభావం

ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పౌల్ట్రీ యజమానులకు తమ ఫారంలకు వెళ్లి మెయింటెన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవి అయితే మునిగిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాలు(Rains) కాస్త తగ్గాక తిరిగి కోళ్లకు దాణా వేయడం వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడానికి విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తగ్గాయి అనుకున్న వర్షాలు మళ్లీ మొదలు కావడంతో ఇక పౌల్ట్రీ నిర్వాహకులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వచ్చేది శ్రావణ మాసం కావడంతో మెజారిటీ ప్రజలు నాన్ వెజ్(Non Veg) కు దూరంగా ఉంటారు. దీంతో తమకు నష్టాలు తప్పవని భావించిన పౌల్ట్రీ నిర్వాహకులు అతి తక్కువ ధరలకే చికెన్ షాపులకు(Chickent Shop) కోళ్లను అమ్మడం మొదలు పెట్టారు. 

రూ.100 కే కిలో చికెన్ 

అప్పటివరకు అటు దానతో బాటు కూలీలకు,  నిర్వహణకు లక్షలు ఖర్చు పెట్టిన కూడా చివరకు కనీస పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. ఇక లీజులపై తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మరోవైపు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చికెన్ షాపు యజమానులు సైతం తక్కువ ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొన్నటివరకూ రెండు వందల ఎనభై రూపాయలు నుంచి దాదాపు 300 రూపాయల వరకు పలికిన చికెన్ ఒక్కసారిగా సగం కంటే తక్కువ ధరకే పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలకే చికెన్ అమ్ముతూ ఉండటంతో జనాలు ఎగబడి కొన్నారు. 

షాపులకు క్యూ

తెలంగాణలో బోనాలు కూడా రావడంతో జనాలు లైవ్ కోళ్లను కొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం కనిపిస్తోంది. ఏదేమైనా వర్షాలు అటు చికెన్ పౌల్ట్రీ యజమానులకు చుక్కలు చూపిస్తే వినియోగదారులకు మాత్రం పండగ వాతావరణాన్ని డబుల్ చేశాయి. పదుల సంఖ్యలో వెరైటీలు చేయగలిగే చికెన్ ఇంత తక్కువ ధరకు దొరుకుతూ ఉండడంతో చికెన్ షాపుల జనాల సందడి కనిపిస్తుంది. 

Also Read : PV Sindhu: బోనాల సంబరాల్లో పీవీ సింధూ, లాల్‌దర్వాజ అమ్మవారికి బంగారు బోనం

Continues below advertisement