పేపర్ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు చూస్తే... బర్ట్ రెనాల్డ్స్ న్యూడ్ షూట్ గుర్తు వస్తుందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా అతడు తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మీమర్స్ కూడా ఈ ఫొటోషూట్ పై వందల కొద్దీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రణవీర్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భౌతికంగా నగ్నంగా ఉండడం తనకు చాలా ఈజీ అని.. అయితే ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో పెర్ఫార్మన్స్ పరంగా నగ్నంగానే ఉన్నానని అన్నారు. ఆ సినిమాలో నగ్నంగా ఉన్న తన ఆత్మను చూడొచ్చని అన్నారు. నిజానికి నగ్నత్వం అంటే అదేనని అన్నారు.
వెయ్యి మంది ముందు కూడా నగ్నంగా నిలబడగలనని.. దాన్ని పెద్దగా పట్టించుకోనని.. కానీ జనాలే అసౌకర్యంగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ' అనే సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?
Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం