అదొక ప్రమాదకరమైన మలుపు. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా అధికారుల మాత్రం పట్టించుకోవడంలేదని చోదకులు ఆరోపిస్తున్నారు. ఒక పెద్ద లారీ లోడ్ తో వెళ్తూ కరెంట్ పోల్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. అయితే షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా అధికారుల్లో ఎలాంటి చలనం రాలేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు స్థానికులు అధికారుల స్పందించి ప్రమాదాలను నివారించేలా సూచికల ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
ప్రమాదకరమైన మలుపు
కరీంనగర్-నిజామాబాద్ హైవే పై కొత్తపల్లి దాటాక కెనాల్ వద్ద బైపాస్ కి సంబంధించిన మూల మలుపు ఒకటి ఉంది. ఇది చోదకుల పట్ల మృత్యుమలుపుగా మారుతోంది. కరీంనగర్-సిరిసిల్ల వెళ్లే దారిలో చింతకుంట వద్ద ములుపు కలుస్తుంది. గ్రానైట్ రాళ్ల లారీలు, ఇతర భారీ లోడ్ లతో వెళ్లే అనేక లారీలు, ఇతర గూడ్స్ వాహనాలు ఈ దారిలో వెళ్తుంటాయి. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. చింతకుంట వద్ద ప్రారంభమైన నాన్ లోకల్ భారీ వాహనాలకు రూట్ పై అవగాహన లేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు ఏకబిగిన స్పీడ్ తో వచ్చి సరిగ్గా వెలిచాల గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద "L" ఆకారంలో ఉన్న రహదారి వద్ద వేగాన్ని అదుపు చేయలేక ఇతర వాహనాలను ఢీ కొడుతున్నాయి. కొన్ని అతివేగంతో వాహనాలు బోల్తా కొడుతున్నాయి.
Also Read: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం
నిర్లక్ష్యం ఎవరిది..?
ఈనెల 17వ తేదీన భారీ కంటైనర్ కరీంనగర్ బైపాస్ నుంచి వెళ్తూ ఇదే ప్రాంతంలో అదుపుతప్పి ఎదురుగా ఉన్న కరెంటు పోల్ ని అతి వేగంగా ఢీకొంది. దీంతో ఆ కరెంటు పోల్ రెండు ముక్కలై పవర్ సప్లై ఆగిపోయింది . దీంతో పక్కనే ఉన్న గ్రానైట్ కంపెనీ తన ప్రొడక్షన్ ని సైతం నిలిపివేసింది. అందులో ఉన్న కార్మికులు కూడా పనిని తాత్కాలికంగా నిలిపివేశారు. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తమ డ్రైవర్ అయోమయంలో వాహనం బోల్తా కొట్టించాడని కానీ తామే తప్పు చేసినట్లు స్థానిక అధికారులు ఫైన్ కట్టమని అంటున్నారని ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని అంటున్నారు. మరోవైపు తమకు ఈ ప్రాంతంలో వరుస ఆక్సిడెంట్ ల వల్ల కరెంటు పోవడం లాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని, హెచ్చరిక బోర్డులు , స్పీడ్ బ్రేకర్ లు పెడితే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని విద్యుత్ సిబ్బంది అంటున్నారు. మరోవైపు డేంజర్ బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు అమానుషం.. ఓ మహిళను వివస్త్రను చేసి దాడికి యత్నం