Jupally On KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జూపల్లి కృష్ణారావు అహంకారి అని అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయారని.. ఈ ఎన్నికల్లో అలాంటి అహంకారానికి ఎవరూ పోవద్దని చెబుతూ కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు చేసిన సూచనలు సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తరపున కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు స్పందించారు. కేసీఆర్ చెప్పింది  బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోమని తనకు సీఎం కేసీఆర్ చెప్పారని..తాను పట్టించుకోలేదన్నారు.  తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవమన్నారు.


బీజేపీతో లోపాయికారీ ఒప్పందం వద్దనుకున్న  జూపల్లి 
 
2018 ఎన్నికల సమయంలో తనను బీజేపీ వాళ్ళతో లోపాయికారీ ఒప్పందం చేసుకొమ్మని కేసీఆర్ చెప్పారన్నారు. కేసీఆర్ చెప్పినట్టు వినలేదు కాబట్టే తనకు అహంకారం అని అంటున్నాడన్నారు. కేసీఆర్‌కి బీజేపీతో ఎప్పటి నుంచో లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. తన ప్రభావం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుంది కాబట్టే తనను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. డిసెంబర్ 3న మూడు రంగుల జెండా ఎగురుతుందని జూపల్లి ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు.                


బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్- 119 చోట్ల బీజేపీ డిపాజిట్లు గల్లంతు- కవిత ఘాటు వ్యాఖ్యలు


జూపల్లి ఓటమిపైకేసీఆర్ ఏమన్నారంటే ? 


గత ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు  చిన్న పొరపాటు కారణంగా ఓడిపోవల్సి  వచ్చింది.  అక్కడ ఒక నాయకుడు అలకబూనారు. విషయం నాకు తెలిసి జూపల్లిని వెళ్లి బుజ్జగించమని కోరాను. కానీ 300 ఓట్లు ఉన్న ఆ నాయకుడిని నేను బుజ్జగించడం ఏంటని జూపల్లి మాట్లాడలేదు. దీంతో కొల్లాపూర్‌లో ఓడిపోవలసి వచ్చింది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉండొద్దని అభ్యర్థులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 


కాంగ్రెస్ తొలి జాబితాలో రెడ్లకు అగ్రపీఠం, బీసీలకు 12 సీట్లు- మిగతా జాబితాల్లో ఎలా ఉండబోతోందో!


గత ఎన్నికల్లో 13 వేల ఓట్లు వచ్చింది బీజేపీ అభ్యర్థికి ! 


కేసీఆర్ చెప్పినట్లుగా అక్కడ బీఆర్ఎస్ రెబల్ కు పదమూడు వేల ఓట్లు రాలేదు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావుకు వచ్చాయి. ఆయననే కేసీఆర్ బుజ్జగించమని జూపల్లికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే జూపల్లి మాత్రం.. బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవడం ఇష్టం లేకసైలెంట్ గా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి హర్ష వర్ధన్ రెడ్డి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత ఆయన  బీఆర్ఎస్ లో చేరారు. జూపల్లిని కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తన ఓటమికి కారణం అహంకారం అన్నట్లుగా  కేసీఆర్ చెప్పడంతో.. అసలు విషయాన్ని జూపల్లి బయట పెట్టారు.