తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసినంతగా ఆవేశపడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన తప్పు తెలుసుకున్నట్లుగా ప్రకటించారు. తాను అలా మాట్లాడటం తప్పేనని పార్టీకి సారీ చెప్పానని ప్రకటించారు. అంతా తన తప్పేనని రేవంత్ రెడ్డి తప్పేమి లేదని ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. పార్టీ అంతర్గత విషయాలు తాను మీడియా ముందు మాట్లాడి తప్పు చేశానని.. మరోసారి అలాంటి తప్పు జరగనీయనని హమీ ఇచ్చారు. తనకు రేవంత్ రెడ్డి సోదరుడు లాంటివాడన్నారు. టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడటమే తమ విధి అని..  రాహుల్, సోనియా డైరక్షన్‌లో పని చేస్తానని వివరణ ఇచ్చారు.  


Also Read : కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?


 అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి హీరోయిజం కాంగ్రెస్‌లో చెల్లదన్నారు. తనకు సమాచారం ఉండటం లేదని.. తనకు రేవంత్ కు గొడవలు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారని మండిపడ్డారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హైకమాండ్‌కు కూడా చేరాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్‌లో సమావేశం అయింది. ఇందులో పాల్గొనేందుకు పార్టీ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కూడా వచ్చారు. 


Also Read : ఒకటే ఫోటో .. కేటీఆర్, విజయసాయిరెడ్డి ప్రచారం ! ఇంతకీ ఎవరిది ఫేక్ ?


జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి తీరును మల్లు రవి తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి తనను అడగడానికి మల్లు రవి ఎవరని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. అయితే అదే సమయంలో జగ్గారెడ్డి పార్టీ వ్యవహారాలను మీడియా ముందు మాట్లాడి క్రమశిక్షణ ఉల్లంఘించారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అధిష్టానం కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లుగా గాంధీ భవన్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో చివరికి జగ్గారెడ్డి పరిస్థితులకు తగ్గట్లుగా తగ్గిపోయారు. వెంటనే తప్పయిపోయిందని ఒప్పుకున్నారు. అయితే జగ్గారెడ్డి గౌరవాన్ని కాపాడేందుకు పార్టీ నేత మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నించారు. ఆయనపై హైకమాండ్ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదని ..కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్య వచ్చిందన్నారు. 


Also Read : తెలంగాణలోనూ ప్రభుత్వ మటన్ మార్టులు.. హోల్ సేల్ అండ్ రీటైల్ !


రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మంది సీనియర్లు ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఉత్తమ్‌కు సన్నిహితుడైన జగ్గారెడ్డి వారి తరపున తరచూ రేవంత్ రెడ్డిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నార్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. అయితే గతంలోలా ఇప్పుడు లేదని ఎవరైనా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి ఇష్యూ ద్వారా పార్టీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపిందని అంటున్నారు.


Also Read : ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి