పబ్లిసిటీ కోసం వాడుకునే ఫోటోల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న సోషల్ మీడియాలో పరువు తీసేస్తారు నెటిజన్లు.  తప్పు ఇట్టే పట్టేస్తారు. ఫేక్ అంటూ ప్రపంచం ముందు పెట్టేస్తారు. ఇటీవల యూపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అభివృద్ధి కోసం బెంగాల్‌లో కట్టిన ఫ్లైఓవర్, బిల్డింగ్‌ల ఫోటోలు వాడుకుంది. ఎలా సమర్థించుకోవాలో తెలియక యూపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఆ యాడ్‌ను విత్ డ్రా చేసుకున్నట్లుగా ప్రకటించింది. కానీ అప్పటికే పోవాల్సిన పరువును  ఆ ప్రకటన పోయేలా చేసింది. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ , ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇలాంటి ఓ ఫేక్ ప్రచారం వివాదంలో ఇరుక్కున్నారు. 


వ్యాక్సినేషన్ విషయంలో తమ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉందని సిబ్బంది పొలాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారని కేటీఆర్ రెండు ఫోటోలు పెట్టి ఓ ట్వీట్ చేశారు. అందులో ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోటో అన్నారు. మరొకటి ఖమ్మం జిల్లాలోనిదని చెప్పారు. 






Also Read : కేశినేని రాజకీయ వైరాగ్యం.. ఇక పోటీకి దూరం !


ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అలాంటి ట్వీటే పెట్టారు. ఆయన ఉత్తరాంధ్రలో తమ ప్రభుత్వ గొప్పదనం గురించి చెప్పుకున్నారు. ఆయన కూడా ఫోటోలు పెట్టారు. 





Also Read : "ఎయిడెడ్‌" స్వాధీనానికి బెదిరింపులు .. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం !


ఇద్దరూ తమ తమ ప్రభుత్వాల గొప్పలు చెప్పుకున్నారు బాగానే ఉంది కానీ ఇద్దరూ ఒకే ఫోటో పెట్టారు. ఇక్కడే నెటిజన్లు పట్టేసుకున్నారు. వారు చెప్పిన మ్యాటర్‌లో నిజం ఉందో లేదో పోటోలు మాత్రం ఫేక్ అని తేల్చారు. అయితే ఎవరో ఒకరు ఫేక్ అయి ఉంటారని ఇద్దరూ కాదని కూడా అనుకున్నారు. నిజానికి ఇద్దరూ ఫేక్ పోస్టే చేశారని.. ఆ ఫోటో నారాయమ పేట జిల్లాలోని ఉట్కూర్‌లో వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ వేస్తున్న ఫోటో అని ఓ దినపత్రికలో వచ్చిన వార్తను కొంత మంది నెటిజన్లు షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి ట్వీట్లను చూపిస్తే ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల నేతలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు.  వారు గతంలో చేసిన ట్వీట్లను కూడా బయటుక తీసి వీళ్లు అన్నీ ఫేక్ గొప్పలు చెబుతూ ఉంటారని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేటీఆర్ స్పందించారు. ఇతర దినపత్రికల్లో వచ్చిన వ్యాక్సినేషన్ వార్తలను ట్వీట్ చేశారు.






మొత్తంగా అయితే విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్, ఫోటోలు ఫేక్ అని తేలిందని నెటిజన్లు తీర్పు చెబుతున్నారు. పనిలో పనిగా బీజేపీ నేతలు అసలు వ్యాక్సిన్ ఎవరు ఉచితంగా ఇస్తున్నారని.. ప్రశ్నిస్తున్నారు. అంతా మోడీ క్రెడిట్ అయితే.. మధ్యలో మీరేంటని ప్రశ్నిస్తున్నారు.  రాజకీయాల్లో అంతే .. ఎవరి గోల వారిదే...!


 


Watch Video : ‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ ఆవేదనతో రైతు సెల్ఫీ వీడియో


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి