బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో ప్రియా, లహరి, మానస్, ప్రియాంక, శ్రీరాంచంద్ర ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి బయటకు వెళ్లేదెవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. నిన్న హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో జెస్సీ గెలిచి కెప్టెన్ అయ్యే అర్హత పొందాడు. అతడు కెప్టెన్ కాగానే.. షణ్ముఖ్ ను రేషన్ మ్యానేజర్ గా చేశాడు. ఇదిలా ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి. 

 


 

మొదటి ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ లో ఎవరైతే సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదో వారి పేరుని చెప్పాలని బిగ్ బాస్ సూచించారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఒకరి పేరు చెప్పాలని కోరారు. ఈ విషయంలో మానస్ తన పేరు తనే చెప్పుకున్నాడు. అలా కుదరదని జెస్సీ అనగా.. వెంటనే వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ పేరు చెప్పాడు. అనంతరం నటరాజ్ మాస్టర్ కొందరు హౌస్ మేట్స్ తో కూర్చొని గేమ్ ఆడడం రాదని.. సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

 

ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే మరో ప్రోమో వచ్చింది. అందులో నటరాజ్ మాస్టర్ ఏడుస్తూ కనిపించారు. ముందుగా.. హౌస్ లో బిడ్డ ఏడుపు వినిపించగా.. ఎక్కడ నుంచి ఏడుపు వినిపిస్తుందా అని అందరూ పరుగులు తీశారు. ఆ తరువాత బిగ్ బాస్ టీవీలో నటరాజ్ మాస్టర్ భార్యకు జరిగిన సీమంతాన్ని చూపించారు. అది చూసిన నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ టీవీలో కనిపించిన తన భార్యను ముద్దాడారు.