తెలంగాణలో  రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు బీజేపీతోనే తమ పోరాటం అన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. అది వ్యూహాత్మకం అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం తమ పొలిటికల్ గేమ్ ప్లాన్ జోరుగా అమలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీతో కలిసి విపక్షాల కూటమి సమావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటూ ఉండటమే.


Also Read : ఈ స్కూటర్‌కి తాళం అక్కర్లేదు.. ఫోన్‌లో సెల్ఫీ దిగితే స్టార్ట్ అయిపోద్ది.. హైదరాబాద్‌లో కొత్తరకం స్కూటీలు


రాహుల్ గాంధీతో కలిసి విపక్షాల కూటమిలో టీఆర్ఎస్‌ పీపీ నేత కేశవరావు !


రాజ్యసభలో పన్నెండు మంది ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. దీనిపై విపక్షాలన్నీ పోరుబాట పట్టాయి. ఈ సందర్బంగా ఏం చేయాలన్నదానిపై చర్చించడానికి విపక్షాలు సమావేశమయ్యాయి. అనూహ్యంగా ఈ సమావేశానికి టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు హాజరయ్యారు. ఆయన రాహుల్ గాంధీ పక్కనేక కూర్చుని రాజకీయం ప్రారంభించారు. అక్కడ ఆ సన్నివేశం తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్క సారిగా గుబులు పుట్టించింది.


Also Read: Nellore Crime: బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!


కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్న  టీఆర్ ఢిల్లీ వ్యూహాలు !


కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ భేటీ టీ కాంగ్రెస్ నేతల్ని ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసింది. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతూ.. తమ మధ్యనే పోటీ ఉందని టీఆర్ఎస్, బీజేపీ ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని  ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్‌కే దగ్గర అన్నట్లుగా ఢిల్లీలో రాజకీయాలు ఉండటంతో టీ కాంగ్రెస్ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.


Also Read : ధాన్యం ఎట్ల కొనవో చూస్తా బిడ్డా.. ఆ ఒప్పందాలేమైనా చేసుకుంటున్నవా? డౌట్ వస్తున్నది: బండి సంజయ్


పొరపాటున కూడా కాంగ్రెస్‌ను విమర్శించని కేసీఆర్.. బీజేపీనే టార్గెట్ !


ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు. పూర్తిగా బీజేపీ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ బీజేపీని,  కేంద్ర మంత్రులను పరుష పదజాలంతో దూషించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం చేతకానిదని మండిపడ్డారు. పూర్తిగా ఆయన బీజేపీనే ప్రత్యర్థి అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శిస్తే మళ్లీ ఆ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన అసలు కాంగ్రెస్‌ను పట్టించుకోవడం మానేశారు. కేసీఆర్ రాజకీయ వ్యూహం ప్రకారం.. తన ప్రత్యర్థిని ఆయన వీలైనంత తక్కువగా తాము ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తూంటారు. పెద్దగా బలం లేని వారిపై ఆయన విమర్శలు చేస్తూంటారని అంటారు. ఈ ప్రకారం చూస్తే కాంగ్రెస్ ఎదగకూడదన్న లక్ష్యంతోనే బీజేపీని ఆయన తమ ప్రత్యర్థిగా ఫోకస్ చేస్తున్నారని కొంత మంది అంచనా వేస్తున్నారు.


Also Read: CM KCR: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...


నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా ? 


బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్ష పార్టీలకు టీఆర్ఎస్ దగ్గర అవుతుండటంతో అది కేవలం అంశాలవారీ మద్దతులో భాగమా? లేక కాంగ్రెస్‌కు సహకారం అందించాలనే నిర్ణయంలో భాగమా? లేదంటే రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ నుంచి సహకారం పొందడానికేనా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న కేశవరావు ..కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలతో ఆయన ఇప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అందుకే ఏమైనా జరగవచ్చన్న అంచనాలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో టీఆర్ఎస్ వైఖరి ఇప్పటివరకు ఉప్పు-నిప్పుగా ఉన్నప్పటికీ.. కేంద్రంలోని పెద్దలతో మాత్రం సత్సంబంధాలే ఉన్నాయి. యూపీ ఎన్నికల్లో ఎంఐఎంను పోటీ చేయించడం ద్వారా బీజేపీకి సహకరిస్తోందన్న అనుమానాలు కూడా టీఆర్ఎస్ పై ఉన్నాయి.


Also Read: TS Cabinet : ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !


రేవంత్ రెడ్డికి పెను సవాలే !


ఢిల్లీలో టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం రేవంత్ రెడ్డికి .. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. కేసీఆర్‌పైన యుద్దం ప్రకటించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తున్న దశలో ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు హాజరుకావడం ఎక్కడికి దారి తీస్తుందోననే గుబులు మొదలైంది. పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ కార్యాచరణ మొదలు పెట్టిన రేవంత్‌ వీలైనంతగా టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని చెప్పేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల అంశంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని, ఇద్దరూ కలిసి రైతులను నిండా ముంచుతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు.  


Also Read:చక్రాలపై మన భవిష్యత్ భద్రంగా ఉంది.. బస్సులో హోం వర్క్ చేస్తున్న విద్యార్థి వీడియో ట్వీట్ చేసిన సజ్జనార్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి