స్పేస్ లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నాడు ఓ వ్యక్తి.. అడ్డెడ్డేడ్డే ఎన్న ప్లానింగ్ తలైవా అనాలి అనిపిస్తుంది కదా.. సరిగ్గా ఇలాంటి అరుదైన ఘనత సాధించాడు... భారతీయ మూలాలున్న ఓ అమెరికన్ నాసా ఆస్ట్రోనాట్. అతనెవరో, అతని నేపథ్యమేంటో ఓ రౌండ్ వేద్దామా...?


ఆర్టెమిస్ ప్రోగ్రామ్.. నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు. చంద్రుడిపై జీవన అవకాశాలను పరిశీలించేందుకు 18 సభ్యుల బృందాన్ని నియమించింది. అన్నీ అనుకున్నట్టు దాదాపు మరో మూడేళ్లలో చంద్రుడిపై తొలిసారిగా ఓ పురుషుడు, ఓ మహిళను నడిపించాలని నాసా సంకల్పం. అదే కనుక నెరవేరితే... ఆ 18 మంది సభ్యుల్లో ఓ తెలుగు మూలాలున్న వ్యక్తీ ఉన్నాడని మనమంతా గర్వపడొచ్చు. అతనే... రాజా జాన్ వూర్పుటూర్ చారి.


తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ చారి అమెరికాలో వెళ్లి స్థిరపడ్డారు. పెగ్గీ ఎగ్ బర్ట్ అనే విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుడే రాజాచారి. నాసా ఆస్ట్రోనాట్ మాత్రమే కాక అమెరికన్ టెస్ట్ పైలట్ కూడా. సుమారు 2వేల గంటలు విమానాలు నడిపిన అనుభవమూ ఉంది. అమెరికా వాయుసేనలో కల్నల్ గా పనిచేశారు. ఆర్టెమిస్ ప్రోగ్రాం కోసం 2017 జూన్ లో నాసాకు 18వేల అప్లికేషన్లు రాగా.. అప్పుడు రాజాచారి సెలెక్ట్ అయ్యారు. రెండేళ్ల శిక్షణనూ పూర్తి చేసుకున్నారు. డిసెంబర్ 2020లో 18 మంది సభ్యుల ఆర్టెమిస్ బృందాన్ని నాసా ఎంపిక చేసింది. అందులో ఎంపికైన ఏకైక గ్రూప్-22 ఆస్ట్రోనాట్ గా రాజాచారి ఖ్యాతి గడించారు. 1997లో కల్పనా చావ్లా, 2006లో సునీతా విలియమ్స్ తర్వాత స్పేస్ లోకి వెళ్లిన తొలి భారతీయ అమెరికన్ గా రాజాచారి గుర్తింపు పొందారు. స్పేస్ లోకి వెళ్లిన తర్వాత... అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రాజాచారి... అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.  


ఆర్టెమిస్ ప్రోగ్రాంకు ఎంపికైన తర్వాత మాట్లాడిన రాజాచారి... ఓ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి ఆస్ట్రోనాట్ అవడం తన కల అన్న రాజాచారి... కుటుంబసభ్యుల మద్దతు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.


Also Read: Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఇంట్లో కరోనా కలకలం... కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్...


Also Read: Karnataka Sanskrit University: 100 ఎకరాల్లో రూ.300 కోట్లతో సంస్కృత విశ్వవిద్యాలయం.. మంగళవారం సీఎం శంకుస్థాపన


Also Read: Fake Pan Card Check: పాన్‌ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి


Also Read: CM Jagan: రాజధానితో సహా అన్నీ కోల్పోయాం... 58 శాతం జనాభాకు 45 శాతం రెవెన్యూ... ప్రధాని మోదీకి నివేదించిన సీఎం జగన్