ఓ వైపు రైలు వేగంగా వస్తోంది. మరోవైపు రైలు కోసమే వెయిట్ చేస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా పట్టలపైకి వచ్చాడు. మరికొద్ది సేపటిలో రైలు అలా వస్తుందని తెలియగానే.. అతడు పట్టాలపై పడుకున్నాడు. అయితే.. అతడికి ఈ భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి. దూరం నుంచే రైలు డ్రైవర్ (లోకో పైలట్) అతడిని గమనిచాడు. సరిగ్గా అతడిని సమీపిస్తుండగా బ్రేకులు వేశాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. అతడిని పట్టాల మీద నుంచి లేపారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాల్లో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: అద్భుతం.. వేళ్లతో కాదు ‘మెదడు’తో ట్వీట్లు చేస్తున్న పెద్దాయన.. ఇదిగో ఇలా..
ఈ ఘటన ముంబయిలోని సెవ్రీ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఆ రైలు డ్రైవర్‌ను కొనియాడారు. ‘‘మోటర్‌మ్యాన్(రైలు డ్రైవర్) చేసిన పని మెచ్చుకోదగినది. ముంబైలోని సెవ్రీ స్టేషన్‌లో ట్రాక్‌పై పడుకున్న వ్యక్తిని చూసిన వెంటనే మోటర్‌మ్యాన్ అప్రమత్తమయ్యాడు. వెంటనే అత్యవసర బ్రేక్‌ను వేసి.. అతడి ప్రాణాలు కాపాడాడు. మీ జీవితం విలువైనది, ఇంట్లో మీ కోసం మీ ఆప్తులు వేచి చూస్తుంటారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజనులు సైతం మోటర్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి