YS Bhaskar Reddy News: వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండగా, బీపీ లెవెల్స్ పెరిగిపోయినట్లు సమాచారం. దీంతో జైలు సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత భాస్కర్‌రెడ్డిని పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌ హాస్పిటల్ కు తరలించనున్నట్లు పోలీసులు చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్టు అయ్యారు. హత్య కోసం వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు.      


మెరుగుపడ్డ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం


వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అవినాష్ తల్లి ఆరోగ్యం కుదట పడింది. ఆమె కోలుకున్నట్టు అవినాష్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆమెను డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు వివరించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్టు వెల్లడించారు. తన తల్లిని తీసుకొని అవినాష్‌ రెడ్డి కర్నూలు నుంచి హైదరాబాద్ బయల్దేరారు. వారం రోజులుగా కర్నూలు కేంద్రంగా సాగుతున్న హైడ్రామాకు నేటి తెరపడింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మే 19న సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని సీబీఐకు లెటర్ రాసి పులివెందుల బయల్దేరి వెళ్లిపోయారు.        


మే 19న ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో బాగాలేదని పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం తెలుసుకున్న అవినాష్‌ హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు. అవినాష్ తల్లి పరిస్థితి సీరియస్‌గా ఉందని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో పరిస్థితి మరింత సీరియస్‌ గా ఉందని కర్నూలుకు తరలించారు. అక్కడే వారం రోజుల పాటు చికిత్స అందించారు. 


Also Read: దువ్వాడ శ్రీను షాక్ ఇచ్చిన సీఎం జగన్ - టెక్కలి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా దువ్వాడ వాణి పేరు ఖరారు !