Lady Constable Suicide: పాపం.. నిశ్చితార్థం రద్దవుతుందేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. గతంలోనే ఓ సారి పెళ్లి నిశ్చయం అయి నిశ్చితార్థం అయ్యాక క్యాన్సిల్ అయింది. ఏడాది తర్వాత మళ్లీ పెళ్లి కుదిరింది. అయితే వరసకు అతడు.. సదరు మహిళకు కొడుకు అవుతాడని కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం విని.. ఈ నిశ్చితార్థం కూడా ఎక్కడ క్యాన్సిల్ అవుతోందనని భయపడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. 


అసలేం జరిగిందంటే..?


రంగారెడ్డి జిల్లా కందుకూరు జైతారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల సురేఖ 2018 బ్యాచ్ కానిస్టేబుల్. అయితే ఈమె ప్రస్తుతం తన సోదరితో కలిసి అలియాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో పని చేస్తుంది. అయితే సురేఖకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు అయింది. అయితే ఏడాది తర్వాత అంటే ఈనెల 1వ తేదీన స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో పెళ్లి కుదిరింది. అయితే ఆ యువకుడు సురేఖకు వరుసకు కొడుకు అవుతాడట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు చర్చించుకుంటుండగా సురేఖ విన్నది. ఈ క్రమంలోనే గతంలో లాగానే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందేమోనని భయపడింది. తన పరువు పోతుందని భావించి ప్రాణాలు తీసుకోవడం మేలనుకుంది. అనుకున్నదే తడువుగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 


నాలుగు రోజుల్లో నిశ్చితార్థం.. అంతలోనే


ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన 30 ఏళ్ల గోనె లెనిన్ రెడ్డి.. డిగ్రీ వరకు చదువుకున్నాడు. కరీంనగర్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 8వ తేదీన అతడికి ఎంగేజ్ మెంట్ ఉంది. దీంతో లెనిన్ మంగళ వారమే ఇంటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తన తల్లి పద్మను ఫంక్షన్ కోసం గిర్నిబావికి తీసుకెళ్లాడు. అనంతరం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి చూడగా.. లెనిన్ అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. "జీవితంపై విరక్తి కల్గుతోంది.. చావాలనిపిస్తోంది.. అమ్మను బాగా చూసుకో అన్నయ్య" అంటూ ఓ లెటర్ రాసి పెట్టి మరీ లెనిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నవీన్ కుమార్ మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు. 


నెలరోజుల క్రితం విద్యార్థి ఆత్మహత్య


మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన అక్షయ్ చదువు నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అయితే ఇతని తండ్రి వినోద్ నాందేడ్ లోనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేడ్చల్ జిల్లా చీర్యాల గ్రామ పరిధిలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో.. ఫార్మసీ చదువుతున్న అక్షయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు ఉదయమే అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అక్షయ్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తాను ఎందుకు చనిపోతున్నది గుర్తించారు. అయితే అక్షయ్ ఆర్మీలో జవాన్ గా సెలెక్ట్ కాదా.. ఆ ఉద్యోగానికి వెళ్లొద్దని అతడి తల్లిదండ్రలు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.