Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్న వందే భారత్ రైలు ఈనెల 19వ తేదీన అందుబాటులోకి రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా హాజరై ఈ రైలును ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడవనున్న ఈ రైలును విశాఖపట్నం పరకు పొడగించే అవకాశం ఉంది. కర్టాణటకలోని కలబురగి నుంచి ప్రధాని హైదరాబాద్ వస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్ ను 699 కోట్ల రూపాయల వ్యయంతో పనరాభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. అయితే ఇందుకోసం గుత్తెదారు ఎంపిక అక్టోబరులోనే పూర్తి అయింది. 


రైల్వేశాఖ దేశంలోని  ప్రధఆన రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్ సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది. స్థానిక ఎంపీ, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ రీ డెవలప్ మెంట్ తో పాటు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని గత నెలలోనే ఆయన ఆహ్వానించారు. 36 నెలల్లో పునరాభివృద్ధి పనులు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది. నిత్యం ఇక్కడ నుంచి 200 రైళ్లు. 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో 2040 నాటికి ఉండే అవసరాలు, రద్దీని తట్టుకునేలా ప్రణాళిక రూపొందించారు. 


అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ మాదిరిగా కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం, రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోనే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి లేదా రాత్రి 9, 10 గంటల్లోపు గమ్య స్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు న్యూఢిల్లీ నుంచి ఉత్తర జమ్మూలోని వారణాసికి అలాగే వైష్ణో దేవితో బెంగళూరు మీదుగా మైసూరు, చెన్నైతో కలుపుతున్నాయి. వాస్తవానికి, రాబోయే మూడేళ్లలో చాలా పెద్ద, మధ్య తరహా నగరాలను కలుపుతూ 400 కొత్త తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేసింది.


వేగ పరిమితులు.. 


ఒక్క రేక్ ఖరీదు రూ.100 కోట్లకు పైమాటే. దీని గరిష్ట వాణిజ్య వేగం గంటకు 160 కి.మీ. పరీక్ష సమయంలో ఇది 180 కేఎంపీహెచ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ స్పీడ్‌ను తట్టుకునే శక్తి ఇప్పుడు ఉన్న ట్రాక్‌లకు లేదు. అందువల్ల రైలు గరిష్టంగా 130 కేఎంపీహెచ్ వేగంతో నడుస్తుంది. ఇందులో 16 ప్యాసింజర్ కార్లు ఉన్నాయి. వీటిలో 11 వందల కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. కోచ్ ఛాసిస్ 23 మీటర్ల పొడవు ఉంటుంది. రైలు ఫ్రేమ్ పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. వందేభారత్ తయారీకి సంబంధించిన 80 శాతానికి పైగా భాగాలు మన దేశానికి చెందినవే. ఇది జీపీఎస్-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ. బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కలిగి ఉంటుంది.