ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభంం కానున్న సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఈ ట్రైన్‌ 130 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్‌ గూడూరు మధ్య ప్రయాణించనుంది. తెనాలి, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. 


సికింద్రాబాద్‌, తిరుపతి మధ్య 661 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ దూరాన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుకుంటుంది. ప్రయాణికులు ఈ ట్రైన్ ఎక్కేందుకు స్లైడింగ్ ఫుట్‌స్టెప్‌లను, ఆటోమెటిక్ ప్లగ్ డోర్‌లను అమర్చారు. కోచ్‌ల మధ్య టచ్‌ఫ్రీ స్లైడింగ్‌ డోర్‌లను అమర్చారు. దివ్యాంగుల కోసం ప్రకత్యేకంగా డిజైన్ చేసిన వాష్‌రూంలు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్‌ ట్రైన్‌లో ఉన్నాయి. 


ఇవాళే ప్రదానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న సికింద్రాబాద్‌, తిరుపతి వందేభారత్‌ బుకింగ్స్‌ ఈ ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేపటి (ఆదివారం) నుంచి రైల్వే శాఖ రెగ్యులర్ సర్వీస్‌లు నడపనుంది. ఈ ట్రైన్ ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనుంది. మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్య తిరుపతి చేరుకుటుంది. అక్కడ 3.15కి బయల్దేరి రాత్రి  11.30 నుంచి పన్నెండు గంటల మధ్య సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందే భారత్‌కు ఆదివారం సెలవు అయితే... తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్‌కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించారు. 


టికెట్‌ రేట్లు పరిశీలిస్తే... సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఏసీ చైర్‌కార్‌కు 1680 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్‌ ధర 3080 రూపాయలు. తిరుపతి నుంచి సికింద్రబాద్‌ వచ్చే ట్రైన్‌లో ఏసీ చైర్‌కార్‌ ఖరీదు 1625 రూపాయలు ఉంటే ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కు 3030 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇందులో బేస్‌ప్రైస్‌ 1168 ఉంటే... రిజర్వేషన్ ఛార్జి 40రపాయలు ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జి 45 రూపాయలు, ఈ టికెట్‌పై జీఎస్టీ63రూపాయలు ట్రైన్‌లో ఫుడ్ కావాలంటే మాత్రం 364 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 


ఏ ఏ స్టేషన్‌లలో ఆగనుంది.. సికింద్రాబాద్, తిరుపతి నుంచి అక్కడకు టికెట్‌్ ప్రైస్‌ ఒక్కసారి చూస్తే.. చైర్‌ కార్‌ బోగీలో సికింద్రాబాద్‌ నుంచి నల్గొండ వెళ్లాలనుకుంటే 470 రూపాయలు చెల్లించాలి. గుంటూరు వెళ్లాలంటే 865 రూపాయాలు, ఒంగోలు వెళ్లాలంటే 1075 రూపాయలు, నెల్లూరు వెళ్లాలంటే 1270 రూపాయలు, తిరుపతి వెళ్లాలంటే 1680 రూపాయలు చెల్లించాలి. సికింద్రాబాద్‌ నుంచి ఎగ్జిక్యూటివ్ కార్‌లో నల్గొండ వెళ్లాలంటే 900, గుంటూరు వెళ్లాలంటే 1620. ఒంగోలుకు 2045 రూపాయలు, నెల్లూరుకు 2455 రూపాయలు, తిరుపతికి 3080 రూపాయలు చెల్లించాలి.