Kishan Reddy About Rahul Gandhi: పార్టీని నడపలేను అంటూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని.. కాంగ్రెస్, టీఆర్ఎస్ DNA ఒకటేనని.. రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ఉపన్యాసం విని ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కర్ణాటక విజయంతో రాహుల్ ఊహాలోకాల్లో వివరిస్తున్నాడని, ఒక 4 నెలలు ఆగితే ఎవరి భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుస్తుందంటూ సెటైర్లు వేశారు. బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని రాహుల్ గాంధీ తేల్చారు. బీజేపీ భవిష్యత్తు తేల్చాల్సినది తెలంగాణ ప్రజలు, అసమర్థ రాహుల్ కాదు అని.. తెలంగాణ ప్రజలు అని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ ను నమ్మి జనం ఓటేసి కొందరు ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ప్రజల నమ్మకాన్ని వమ్మూ చేస్తూ గాంధీ భవన్ నుంచి 12 మంది తెలంగాణ భవన్ కు వెళ్లారని గుర్తుచేశారు. పార్టీ యావత్తు కట్టకట్టుకుని తెరాస లో విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని నేత రాహుల్ గాంధీ బీజేపీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ చురకలంటించారు. బీఆరెస్, కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ మీద కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 


గత కొంతకాలం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పార్లమెంట్ లో పనిచేశాయని.. రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ అభ్యర్థిని బేగంపేట్ airport నుంచి భారీ ర్యాలీ చేసి సన్మానించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చెప్పండి బీఆర్ఎస్ తో కలిసి పనిచేసింది బీజేపీనా, లేక కాంగ్రెసా అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ డీఎన్యే ఒకటే. రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివన్నారు. పార్టీని నడపలేను అంటూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


టీఆర్ఎస్, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయలేదు
బీజేపీ ఎన్నడూ టీఆర్ఎస్/బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీ చేయలేదు అని గతంలో ఈ పార్టీల పొత్తులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో రాష్ట్రంలో, కేంద్రంలో పొత్తులు పెట్టుకుని అధికారం పంచుకున్న పార్టీలకు బీజేపీని విమర్శించే అర్హత లేదంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎంత దూరమో, బీఆర్ఎస్ కూడా అంతే దూరమని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి పై పోరాడతామని ఎర్రకోట మీద ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అంశానికి కట్టుబడి ఉంటామన్నారు.


సిద్ధాంత పరంగా బీఆరెస్ కి, బీజేపీకి పూర్తి వైరుధ్యం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉంటే తమ స్వార్థ రాజకీయాల కోసం జనం మధ్య చిచ్చు పెట్టే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ సైనికులను, దేశ గౌరవాన్ని మంటగలిపే పార్టీ కాంగ్రెస్ అని.. కులాలు, మతం, ప్రాంతం పేరుతో పబ్బం గడుపుకునే పార్టీ అని హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. ప్రధాని పదవి నిలుపుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆ పార్టీలకు కుర్చీ కోసం ఆరాటమే తప్ప ఇంకేమీ లేదని.. అందువల్లే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial