Uma Harathi: యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించింది నూకల ఉమా హారతి. తెలంగాణలోని నారాయణ పేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురే ఉమా హారతి కావడం గమనార్హం. అయితే ఈమె సాధించిన విజయానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే ఇంత గొప్ప విజయం సాధించాడనికి తన నాన్నే తన స్పూర్తి అని నూకల ఉమా హారతి తెలిపారు.
ప్రముఖ వాజీరాం ఇన్ స్టిట్యూట్ లో కోచింగ్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన నూకల ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు. తల్లి శ్రీదేవి. అయితే తండ్రి ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తు్నారు. ఉమా హారతికి ఓ సోదురడు కూడా ఉండగా ఆయన ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈమె ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు భారతీయ విద్యాభవన్ లో చదువుకున్నారు. ఆ తర్వాత నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఐఐటీలో సివిల్ ఇంజినీర్ కూడా పూర్తి చేశారు. అయితే ఆమెకు మొదటి నుంచి సివిల్స్ సాధించాలి ఉండేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు కూడా ఓకే చెప్పారు. దీంతో ఉమా హారతి సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లారు. ప్రముఖ వాజీరాం ఇన్ స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నారు. అయితే అక్కడే ఉండి చదవడం కంటే ఇంట్లో ఉండి చదువుకోవడం మేలనిపించి తిరిగి ఇంటికి వచ్చేశారు. తనకు తెలియని, అవసరమైన విషాయలను ఇంటర్నెట్ లో చూసుకొని స్వతహాగా నోట్స్ తయారు చేసుకొని చదువుకున్నట్లు తెలిపింది.
Also Read: వంట కార్మికురాలి కొడుకు సివిల్స్‌లో 410వ ర్యాంకర్ - అదరగొట్టిన దళిత బిడ్డ
నాన్న స్పూర్తితోనే టెన్షన్ లేకుండా ప్రిపేర్ అయ్యా..
అయితే తాను ఐదో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించగల్గినట్లు తెలిపారు. గతంలో ఇంటర్వ్యూకు కూడా హాజరైనప్పటికీ.. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లు వివరించారు. బ్యాడ్మింటన్, కుకింగ్ లతో తన ఒత్తిడిని తగ్గించుకున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో పుస్తకాలు తప్ప మరే విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకపోయేదాన్నని.. కానీ ఈసారి మాత్రం పుస్తకాలే కాకుండా మిగతా విషయాలపై దృష్టి సారించినట్లు వివరించారు. ఈక్రమంలోనే తాను అనుకున్నది సాధించగలిగానని తెలిపారు. అయితే తాను ఏదో ఒక ర్యాంకు వస్తుందని అనుకున్నారట కానీ.. ఏకంగా మూడో ర్యాంకు వస్తుందని అస్సలే అనుకోలేదట. ఐదేళ్లుగా తాను సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటే తన కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. ఎమోషనల్ సపోర్ట్ ఉండడం వల్లే తానీ స్థాయికి చేరుకున్నానని అన్నారు. ముఖ్యంగా తన తండ్రి స్ఫూర్తితోనే తాను ఇన్ని రోజులు ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రిపేర్ కాగలిగినట్లు వెల్లడించారు. తన నాన్నే తన హీరో, స్ఫూర్తి అని ఉమా హారతి గర్వంగా చెప్పారు.
నా స్నేహితులకు కూడా మంచి ర్యాంకులే..
అయితే ఒక ఐఏఎస్ గా తాను మహిళలు, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని తెలిపారు. అలాగే ఇదివరకు ఐఏఎస్ కు ఎంపికైన నిఖిల్ తో పాటు అంకిత, దీక్షితలు తనను గైడ్ చేశారని.. వాళ్ల సలహాలు, సూచనలు చాలా ఉపయోగ పడ్డాయని వివరించారు. తాము మొత్తం ఆరుగురు స్నేహితులు కాగా.. ఈ సారి అంతా సివిల్స్ పరీక్షలు రాసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో తనతో పాటు పవన్ దత్త, జయసింహారెడ్డి, అక్షయ్ దీపక్ ఐఏఎస్ కు ఎంపికైనట్లు వివరించారు.
Also Read: కోచింగ్ లేకుండా 35వ ర్యాంకు - సివిల్స్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థి