IT Rides: హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో 30 చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌తోపాటు విశాఖలో కూడా సోదాలు జరుగుతున్నాయని సమాచారం. 


కోహినూర్ గ్రూప్‌తోపాటు మరో రియల్ ఎస్టేట్ కంపనీలో ఇన్‌కాం ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు చేస్తుండటం కలకలం రేపుతోంది. 


హైదరాబాద్‌తో పాటు శివార్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న కోహినూర్ కంపెనీ. కోహినూర్ గ్రూప్ అఫ్ కంపెనీ ఎండీ మజీద్‌తోపాటు డైరెక్టర్లు ఇళ్ళలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలు ప్రభుత్వ భూముల్లో కోహినూర్ గ్రూపు వెంచర్లు వేసినట్టు సమాచారం. 


ఒక రాజకీయ నాయకుడికి కోహినూర్ గ్రూపునకు ఇది బినామీగా ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఆదాయ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ కంపెనీకి చెందిన రియల్ ఎస్టేట్, ఫార్మా, ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. 


విశాఖలో కూడా పలు ఫార్మా కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు ఐటీ రైడ్స్ నడుస్తున్నాయి. పదికిపైగా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 10కిపైగా బృందాలు పాల్గొన్నట్టు సమాచారం.