TSRTC Tour Package for Arunachalam Giri Pradakshinaహైదరాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) నిర్ణయం తీసుకుంది. గురుపౌర్ణమి సమయంలో భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణకు పెద్ద సంఖ్యలో వెళ్తారు. దాంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సు ప్యాకేజీ పూర్తి వివరాలను టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆసక్తి గల భక్తులు తమ సర్వీసులు వినియోగించుకుని, అ చేయాలనుకునే భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణను సులభతరం చేసుకోవాలని సూచించారు. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది.
టీఎస్ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ వివరాలిలా..- జులై 3న అరుణాచల గిరి ప్రదర్శన సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సర్వీసు నంబర్ 98889 బస్సు జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది.- ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని వినాయకుడి దర్శనం చేసుకుంటారు. అదే రోజు రాత్రి 10 గంటలకు బస్సు అరుణాచలం చేరుకుంటుంది. - జులై 3 గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్నాక.. అదే రోజు సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు భక్తులను తీసుకెళ్తారు. అక్కడ దర్శనానంతరం.. బయలుదేరి హైదరాబాద్ కు మరుసటి రోజు (జులై 4న) ఉదయం 10 గంటలకు ఈ బస్సు చేరుకుంటుంది. Also Read: TSRTC: తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన 'టి-9 టికెట్'- ఒక్కొక్కరికి రూ.40 వరకు ఆదా
‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంబీజీఎస్, జేబీఎస్ (JBS), దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257, 9959224911 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు.Also Read: T-24 Ticket Price Hike: హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ - టీ-24 టికెట్ ధరలు పెంపు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial