తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ సంస్థలో కీలకమైన మార్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పాత సాంప్రదాయాలకు తిలోదకాలు వదిలి సంస్థను లాభాల బాట పట్టించేందుకు కొత్త ప్రయత్నాలు అమల్లోకి తెస్తున్నారు. తాజాగా మరో కొత్త విధానానికి అధికారులు తెర తీశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మరో వెసులుబాటును కల్పించేందుకు త్వరలో సిద్ధమవుతున్నారు. 


బస్సుల్లో చిల్లర అనేది పెద్ద సమస్య అనే సంగతి తెలిసిందే. గతంలో రూపాయి రెండు రూపాయలు లాంటి కాయిన్స్‌తో కండక్టర్లకు తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి. అందుకని టికెట్ ధరలను రౌండ్ ఫిగర్ చేశారు. అయినా, పెద్ద నోట్లు ఇచ్చే క్రమంలో ఒక్కోసారి చిల్లరకు కాస్త ఇబ్బంది తలెత్తుతోంది. ఈ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు గాను టికెట్‌ తీసుకునే సమయంలో నగదు రహిత లావాదేవీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.


Also Read: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు


డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా టికెట్‌ కొనుగోలు చేసే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలకు వెళ్లే 900 బస్సుల్లో తొలుత కార్డు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చి.. దాని ఫలితం ఆధారంగా ఇతర బస్సుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ఇప్పటికే యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే విధంగా ఆర్టీసీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.


అంతేకాక, నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ఆర్టీసీ ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న బస్‌పాస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా చిల్లర కష్టాలకు చెక్‌ పడుతోంది. బస్సుల్లోనూ ఈ విధానం తీసుకొస్తే చిల్లర సమస్య ప్రయాణికులతో పాటు డ్రైవర్ లేదా కండక్టర్లకు తగ్గనుంది.


Also Read: ఆ మానవ మృగం గురించి కేసీఆర్‌కు తెలీదా? సూసైడ్ సెల్ఫీ వీడియోపై రేవంత్.. తక్షణం సస్పెన్షన్‌కు డిమాండ్‌


Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి