TRS Plenary All Set to Plenary Party Invited 3000 People: టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నేడు ప్లీనరీ నిర్వహిస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని స్థాపించారు. అనుకున్నట్లుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే పలు రంగాల్లో కొత్త రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు. నేడు దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ జాతీయ పార్టీలకు దీటుగా ఎదుగుతోంది. నేడు 13 వరకు తీర్మానాలను టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైంది. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఎటుచూసినా గూలాబీమయంగా కనిపిస్తోంది.


టీఆర్ఎస్ ప్లీనరీకి దాదాపు 3 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు గ్రాండ్‌గా నిర్వహిస్తోన్న పార్టీ ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, అన్ని జిల్లాల లైబ్రరీల చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వానాలు అందాయి. ప్లీనరీకి అహ్వానం అందనివారు బాధ పడవద్దని, ఈసారి కేవలం ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు చెప్పి ఎలాంటి అపోహలు రాకుండా ముందు జాగ్రత్త పడ్డారు కేటీఆర్. 






తెలంగాణ భవన్‌లో, రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు..
తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ఉదయం 9 నుండి 10 గంటల మధ్య గ్రామ పంచాయతీలు, డివిజన్లు, పట్టణ వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేస్తున్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  






Also Read: TRS Plenary 2022 : టీఆర్ఎస్ 21 ఏళ్ల పండుగకు సర్వం సిద్ధం , గులబీమయమైన భాగ్యనగరం 


Also Read: TRS @ 21 : టీఆర్ఎస్‌కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !