Sadar Sammelanam In Hyderabad: దీపావళి తర్వాత తెలంగాణలో సదర్ ఉత్సవాల ఘనంగా జరగనున్నాయి. నారాయణగూడ, ఖైరతాబాద్‌లో ప్రత్యేగా పెంచిన భారీ దున్నలకు అలంకరించి ప్రదర్శనలు చేస్తారు. డీజే మోతలు, డప్పు చప్పుళ్లతో వేడుకను సందడిగా చేస్తారు. నారాయణగూడ వైఎంసీఏ, ఖైరతాబాద్ మహా గణేష్ చౌరస్తాలో సంబరాలు షూరూ అయ్యాయి. అందుకే ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు అధికారులు ఈ సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 


సదర్ వేడుక కోసం సిటీ ముస్తాబైంది. ఈ సంబరాలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదన్న కారణంతో ముందు జాగ్రత్తగా అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. వేడుక జరగే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. వేడుకలు జరిగే నారాయణగూడ, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఉత్సవాలు చూసేందుక వారు మాత్రమే ఆ రూట్‌లలో వెళ్లాలని మిగతా వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. 


Also Read: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి వేడుకలపై స్పెషల్ స్టోరీ


ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌, క్రౌన్ కేఫ్‌ మీదుగా వైఎంసీఏ వైపు వెళ్లే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్‌ మీదుగా పంపిస్తారు. రామ్‌కోఠి నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వెళ్లే వాహనాలను కాచిగూడ క్రాస్ రోడ్స్‌ వద్ద టూరిస్ట్‌ హోటల్ జంక్షన్ వైపుగా మళ్లిస్తున్నారు. కాచిగూడ క్రాస్ రోడ్స్‌, టూరిస్ట్‌ హోటల్ జంక్షన్‌ నుంచి పోస్ట్‌ ఆఫిస్‌ జంక్షన్‌  వెళ్లే ప్రజలను లింగంపల్లి క్రాస్ రోడ్స్‌ వద్ద కాచిగూడ క్రాస్ రోడ్స్‌ మీదుగా పంపిస్తున్నారు.  ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వెళ్లే వాహనాలు విఠల్‌ వాడి వద్ద రామ్‌కోఠి క్రాస్ రోడ్స్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. విఠల్‌వాడి నుంచి రాజ్‌మొహల్లా చిల్లా మీదుగా వెళ్లే వాహనాలు పద్మశాలి భవన్‌ వద్ద రామ్‌కోఠి క్రాస్ రోడ్స్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. క్రౌన్‌ కేఫ్‌ నుంచి బాగ్‌ లింగంపల్లి క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే ప్రజలను పోస్ట్‌ ఆఫీస్ జంక్షన్ మీదుగా బర్కత్‌పుర చమాన్‌కు పంపిస్తున్నారు. బాగ్‌ లింగంపల్లి క్రాస్ రోడ్స్‌ నుంచి వెళ్లే వాళ్లను కాచిగూడ వద్ద డైవర్ట్‌ చేసి బాటా క్రాస్ రోడ్స్‌ మీదుగా పంపిస్తున్నారు.  నారాయణగూడ క్రాస్‌ రోడ్స్‌ టు ఆర్‌‌బీవీఆర్‌‌ఆర్‌‌ కాలేజ్‌ వెళ్లే వెహికల్స్‌ బాబా టెంట్‌ హౌస్‌ వద్ద క్రౌన్ కేఫ్‌ వైపు వెళ్లాలి. బాగ్‌ లింగంపల్లి కాలనీ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రెడ్డి కాలేజ్ జంక్షన్‌ వద్ద బాబా టెంట్‌ హౌస్‌ మీదుగా వెళ్లాలి. బాగ్ లింగంపల్లి క్రాస్ రోడ్స్‌, బైలెన్స్‌ కాలనీ నుంచి రెడ్డి కాలేజ్‌ వైపుగా వెళ్లే ప్రజలను మాతా టెంపుల్ వద్ద డైవర్ట్‌ చేసి పోస్ట్ ఆఫీస్ జంక్షన్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. బర్కత్‌పుర చమాన్‌ నుంచి వెళ్లే వాహనాలను పోస్ట్‌ ఆఫీస్ జంక్షన్ వద్ద క్రౌప్ కేఫ్ మీదుగా మళ్లిస్తున్నారు.  


Also Read: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా