ఎమ్మెల్యేల ఎర కేసులో కీలకమైన రోజు. 


ఎమ్మెల్యేల ఎర కేసులో విచారణ జరుపుతున్న సిట్ ఈ రోజు కీలకమైన వ్యక్తులను హాజరుకావాలని నోటీసులు అందించింది. ఇందులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు. ఆయన ఈరోజు విచారణ కు వస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఒక వేళ బి.ఎల్ సంతోష్  విచారణకు హజరు కాకపోతే అధికారుల తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. అధికారులు మాత్రం విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. దానిపై హైకోర్టు సిట్ అధికారులను కాస్త మందలించింది. సీఆర్‌పీసీ 41 ప్రకారం విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేయటం సాధ్యం కాదని, తదుపరి ఆదేశాల వరకు అరెస్టు చేయొద్దని సిట్ అధికారులను ఆదేశించింది. మరి ఇప్పుడు అధికారులు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం  కేరళకు చెందిన తుషార్ , జగ్గుస్వామి తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ కు నోటీసీలు  ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మిగతావారి పరిస్థితి ఎలా ఉన్నా, బీఎల్ సంతోష్ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అన్నది.. మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు బీజేపీ రాష్ట్ర శిక్షణా తరగతులు హైదరాబాద్ శివారులోని షామిర్ పేటలో జరుగుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా అక్కడే ఉంది. 



నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. 
హైదరాబాద్ శివారులోని షామిర్ పేట లో బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సోమవారం శిక్షణాతరగతులను ప్రారంభించారు. ఈ రోజు రాష్ట్ర కార్యవర్గసమావేశం జరగనుంది. శిక్షాణ శిబిరంలో 14 అంశాలపై చర్చిస్తున్నారు. మొదటిరోజు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఈ రోజు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది ఈ శిక్షణా శిబిరానికి హాజరు అయ్యారు. 


తెలంగాణ లో దశబ్దాకాలంలో ఎన్నడూ లేనంత చలి. 
తెలంగాణలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నడూ లేనిది నవంబర్ మూడో వారానికి ఉష్ణోగ్రత కనిష్టంగా 7.3 డిగ్రీలకు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రానున్న రెండు నెలలపాటు మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే భిన్నంగా అన్ని రకాల జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండడంతో చలిగాలుల తీవ్రత కూడా పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉదయం పూట 10 డిగ్రీలకంటే తక్కువ ఉంది. 


వరంగల్ జిల్లాలో షర్మిల పర్యటన. 
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర నేడు పరకాల చలి వాగు నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర చెన్నపూర్, రూపురెడ్డిపల్లి మీదుగా రేగొండ, ఘనపూర్ లో సాగనున్న పాదయాత్ర.


కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులపై వేటు పడుతుందా? 


తెలంగాణ లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు 16 రోజులు, 375 కిలోమీటర్లు  భారత్ జోడో యాత్ర కొనసాగింది.అయితే తెలంగాణ లో నేతల మధ్య గతకొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సీనియర్ నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ తప్పుతుంది. 


కావాలనే హాజరు కాలేదా?
గాంధీ భవన్  నుంచి  జూమ్ మీటింగ్‌కు హాజరు కాని 11మంది అధికార ప్రతినిధులకు క్రమశిక్షణ క్సంఘం నోటీసులు జారీ చేసింది. జూమ్ మీటింగ్‌కు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది. వాట్సాప్‌లో 11మంది అధికార ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన హాజరు కాలేకపోవడం చర్చకు దారితీస్తుంది. గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆహ్వానించారు. ఎందుకు హాజరు కాలేదు? హాజరు కాలేకపోతున్నము అని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని  నేతలు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తారా లేక లైట్ తీసుకొని వదిలేస్తారా? అనే చర్చ ఇప్పుడు గాంధీభవన్ వద్ద హాట్ టాపిక్ గా మారింది..


మరో వివాదంలో గరికపాటి. 


హిందు దేవాలయాలు హిందువుల చేతుల్లో నడపాలి సత్తుపల్లిలో గరికపాటి సంచలన వ్యాఖ్యలు. హిందు దేవాలయాలు హిందువుల చేతుల్లో నడపబడాలని ప్రముఖ  ఆధ్యాత్మిక ప్రవచన కారుడు గరికపాటి నరిసింహరావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో జరిగిన కార్తీక వనసమారాదన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యానాలు చేశారు.  "రెండు తెలుగు రాష్ట్రాలలోని దేవాదాయ దర్మశాఖను రద్దు చేసి దేవాలయాలను విశ్వహిందు పరిషత్‌కు అప్పగించాలి. ఇలా చేస్తే దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయం హిందువులకే చెందుతుంది. హిందువుల్లోని పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టవచ్చు" అని అన్నారు.