నేడు , రేపు హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్.
ఐ మ్యాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమ్యాక్స్ వరకు కార్ రేస్ జరుగుతుంది. మొత్తం 2.8 KM మేర కార్ రేసింగ్. ఈ ట్రయల్ రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు, 4 డ్రైవర్లు పాల్గొంటారు. 
50 శాతం వివిధ దేశాల్లోని రేసర్లు ఇందులో పాల్గొంటారు. మొత్తం 7500 మంది వరకు చూసేందుకు గ్యాలరీల ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రేసింగ్ ప్రాక్టీస్ సేషన్ ఉంటుంది. శనివారం, ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు కార్ రేస్ ఉంటుంది. డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో మరోసారి రెండో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగుతుంది. ఈ రేస్‌లో పాల్గొనున్న బెంగళూరు స్పీడ్ స్టర్స్, బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచి బృందాలు. ఈ రోజు జరిగే రేస్ లో హైదరాబాద్ రేసర్లు కూడా పాల్గొంటారు. 


ఈ రేసింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి


దేశంలోనే  మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 11తేదిన ఫార్ములా-ఈరేసు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో నేడు, రేపు సర్కూట్ ట్రైల్ రన్ లా ఐఆర్‌ఎల్ నిర్వహించనున్నారు. ఇప్పటికే  (IRL)నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేసింగ్ ట్రాక్ సుందరంగా తీర్చిదిద్దండంతోపాటు వేలమంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు, బారీ కేడ్లు ఏర్పాటు చేసారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రేసింగ్ ప్రారంభమవుతుంది. 6బృందాలు పాల్గొననున్న ఈ రేసేంగ్‌లో సగం మంది రేసర్లు మన దేశానికి చెందిన వారుకాగా, మరో సగం మంది విదేశాలకు చెందినవారు. ఈరోజు జరిగే రేసింగ్ లో హైదరాబాద్ రేసర్లు పాల్గొంటారు. ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబిని పార్క్ , ఎన్టీఆర్ పార్క్ ,ఐమ్యాక్స్  వరకూ రేస్ పోటీ జరగనుంది.


ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి పై జిల్లా టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు 


ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డిపై కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆయన వైఖరితో కొంతమంది నేతలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా జిల్లాలో టిఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏకంగా జెడ్పి చైర్మన్ స్థాయి మహిళా నేత ఎమ్మెల్సీ వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడుతూ ఏకంగా మంత్రులు, సీనియర్ నేతల ముందే కంటతడి పెట్టడం ఆ పార్టీ సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. పార్టీలోకి కొత్తగా వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి కొన్ని పథకాల విషయంలో తన మాట వినకపోవడంతో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ కన్నీటి పర్యంతమైంది. వరుస వివాదాలకు కారణం అవుతున్న పాడి కౌశిక్ రెడ్డి పై ఎలాంటి చర్యలకు దిగుతారో వేచి చూడాల్సి ఉంది.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ కస్టడీ పూర్తి
 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక మంది ప్రముఖలను విచారించిన ఈడీ అధికారులు, ఇప్పటి వరకు విచారణలో తేలిన అంశాలను మరికొంతమందిపై అభియోగాలు మోసి, కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు కంపెనీల లావాదేవీలను చూసిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఈ కేసులో కీలకంగా మారినట్లు సమాచారం. చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు విచారణ పూర్తయింది. ఆయన శుక్రవారం ఢిల్లీలోని ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ స్కామ్ లో 14 నిందితుడుగా ఉన్న రామచంద్రపిళ్లైకు బుచ్చిబాబు చార్డెడ్ అకౌటెంట్. ఈ స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ కు చెందిన బొయినపల్లి అభిషేక్ కస్టడీ నేటి పూర్తి కానుంది. మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ కస్టడీ కూడా ముగియనుంది. ఇప్పటికే బుచ్చిబాబు, అభిషేక్ లనుంచి సేకరించిన సమాచారంతో ఈడీ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కస్టడీలో కూడా అనేక విషయాలు ఈడీ అధికారలు వచ్చినట్లు సమాచారం. తదుపరి విచారణ ఎలా ఉంటుందోనని ఉత్కంఠత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది.