బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. భారీగాా అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో అదుపు చేయడం క్షష్టంగా మారింది. అక్కడకి చేరుకొని వ్యతిరేక నినాదాలు.. ఇంటి అద్దాలు పగులగొట్టారు.


కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రవిస్తున్నారని చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేసిన కవిత... తాను పార్టీలో చేరుతానంటూ చెప్పారని ఎంపీ అరవింద్‌ నిన్న కామెంట్ చేశారు. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. 






తాను కాంగ్రెస్‌లో చేరుతానంటూ ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరుతానంటూ చెప్పినట్టు ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమైన కాంగ్రెస్‌ నేతలు తనకు చెప్పారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన చేసిన ఈ ఆరోపణలు సంచలనం రేపాయి. తండ్రిపై అసంతృప్తితో ఉన్న కవిత ఇలాంటి లీకులు ఇస్తున్నారని విమర్శించారు. 
 
కవిత బెదిరింపులకు భయపడిన కేసిఆర్‌ ఇతర్రాష్ట్రాలకు తీసుకళ్లారని ఎంపీ అరవింద్‌ ఆరోపించారు. అందుకే కేసీఆర్‌ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ లాంటి పార్టీ వద్దనుకుంటే బీజేపీ ఎందుకు ఆకర్షిస్తుందని ప్రశ్నించారు అరవింద్. కవితను బీజేపీలోకి తీసుకొస్తామంటూ మధ్యవర్తిత్వం ఎవరైనా చేస్తే వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. 






ఈ కామెంట్సే ఇప్పుడు బీజేపీ కాకపుట్టిస్తున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ధర్నా చేపట్టాయి. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రేణులు దాడి చేశాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.