క్యాసినో వ్యవహారంలో ఈడీ ముందుకు మరోసారి తలసాని సోదరులు


ఈ కేసులో ఇప్పటికే ఈడీ 130 మందికి నోటీసులు అందించింది. చికోటి ప్రవీణ్ వాట్సప్ ఛాటింగ్, ఫోన్ కాల్స్ ఆధారంగానే నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. నిన్న ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని, హైదరాబాద్ లోని పంజాగుట్టకుచెందిన ఉర్వశీ బార్ ఓనర్ యుగంధర్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ కేసులో మంత్రి తలసాని పిఏ హరీశ్ కు కూడా నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరగడం, ప్రముఖలందరకీ నోటీసులు రావడంపై చర్చ జరుగుతోంది. చికోటీ ప్రవీణ్ తో గతంలో ఫ్రెండ్షిప్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈడీ విచారణ ఎదుర్కొక తప్పదనిపిస్తోంది. 


ఢిల్లీకి బండిసంజయ్, నేడు కీలక నేతలతో భేటి


మునుగోడు ఉపఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ తొలిసారి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈ రోజు జరగనున్న పార్లమెంట్ హౌజింగ్ అండ్ అర్భన్ స్టాడింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ కమిటీలో మెంబర్ గా పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ మీటింగ్ తర్వాత ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలను కలుస్తారని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన పలువురు నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. 


లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు


ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కీలక ఆధారాలు సేకరిస్తోంది. ఇవాళ రాబిన్ డిస్టిలరీస్ డైరక్టర్ అరుణ్ రామచంద్రపిళ్లై తోపాటు పలు కంపెనీలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబులు ఈ రోజు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మరికొంతమందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ఈ కేసు లో ఉన్నట్లు తెలుస్తోంది. 


నేడు సిఎం కృతజ్జత సభ
ఖమ్మంజిల్లాకు రెండు ఎంపీ సీట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్జత తెలుపుతూ ఈరోజు ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ భహిరంగసభ నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బండి పార్థసారధి రెడ్డి, వద్ది రాజు రవిచంద్రలకు రాజ్యసభ సీటు కేటాయించారు. ఈ సభకు మంత్రి పువ్వాడ అజయ్ తోపాటు జిల్లాకు చెందిన ప్రముఖ నేతలంతా హాజరు కానున్నారు. అయితే ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరు కానున్నారు. ఇటీవల ఆయన కాలంలో ఆయన ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు నిర్వహించడం జిల్లాలో చర్చనియాంశంగా మారింది.