తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారబోతుందన్న వార్తల నేపథ్యంలో, ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఆదివారం వివిధ దేశాల ఎన్నారైలతో జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా ‘‘దేశ రాజకీయాలలో కేసీఆర్ నాయకత్వం అవసరం’’ అని మహేష్ బిగాల ప్రతిపాదించిన తీర్మానానికి అన్ని దేశాల ఎన్నారైలు మద్దతు తెలిపారు. అందరూ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు.


ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ఎన్నారైలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాదు అన్న తెలంగాణని  ఎన్నో ఉద్యమాలు చేసి అందరిని ఏకం చేసి తెచ్చిన నాయకుడు కేసీఆర్. అయన మార్గదర్శనంలో తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సందర్భంలో, దేశ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పులు అవసరముంది. దానికి కేసీఆర్ నాయకత్వం అవసరం. దేశంలో అందరిని కలుపుకొనిపోతూ కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసం మాకుంది.’’


భారత రాష్ట్ర సమితి ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు – మహేశ్ బిగాల
ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి టీఆర్‌ఎస్ ను ‘‘భారత రాష్ట్ర సమితి’’గా మార్చే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ దేశాలలో ఉన్న అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడగడతాం.’’ అని అన్నారు. మహేష్ బిగాల ప్రతిపాదించిన "దేశ రాజకీయాలలో కేసీఆర్ నాయకత్వం అవసరం" అన్న తీర్మానానికి అన్ని దేశాల ఎన్నారైలు మద్దతు తెలిపారు.


దేశాన్ని నడపగలడనే సంపూర్ణ విశ్వాసం ఉంది - అనిల్ కూర్మాచలం: యూకే 
‘‘మహేష్ బిగాల తీర్మానాన్ని సమర్థిస్తున్నాను. భారతీయులగా, ఎన్నారైలుగా మేమందరమూ దేశంలో  జరుగుతున్న వరుస రాజకీయ పరిస్థితులను పరిశీలుస్తున్నాం. కేసీఆర్ మాత్రమే తెలంగాణ మాదిరి దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.


న్యూజీలాండ్ ఎన్నారైల సంపూర్ణ మద్దతు – జగన్, న్యూజీలాండ్ ఎన్నారై
‘‘కేసీఆర్ తెలంగాణను సాధించిన స్ఫూర్తితో వారు తలపెట్టిన జాతీయ రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోతున్న ‘‘ భారతీయ రాష్ట్ర సమితి’ పార్టీని న్యూజీలాండ్ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నాం.’’ అని అన్నారు.


ఆస్ట్రేలియా ఎన్నారైల సంపూర్ణ మద్దతు – రాజేష్, సిడ్నీ ఎన్నారై.
‘‘ఆస్ట్రేలియా లో 4  సంవత్సరాల కితమే టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ మొదటి సారి మీటింగులోనే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ గారు రావాలని నాడు అందరూ కోరుకున్నారు. బీఆర్ఎస్ కు మా సంపూర్ణ మద్దతు’’


జై తెలంగాణ.. జై భారత్ - శ్యామ్ బాబు ఆకుల, డెన్మార్క్
‘‘జై తెలంగాణ.. జై భారత్. తీర్మానానికి సంపూర మద్దతు డెన్మార్క్ నుంచి ప్రకటిస్తున్నాం కెసిఆర్ గారిపై మాకు పూర్తి నమ్మకముంది. తెలంగాణ అనే  పదం మర్చిపోతున్న రోజులలో తెలంగాణని సాధించి చూపించారు. దేశమంతా తిరిగి పార్టీని స్థాపించి, తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.’’


పోరాటాల ఖిల్లా తెలంగాణ నమూనా దేశానికి అవసరం - నాగరాజు గుర్రాల :సౌత్ ఆఫ్రికా 
‘‘75 ఏండ్లలో ఎక్కువ కాలం జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్‌ పాలించాయి.. అయినా దేశంలో గుణాత్మక మార్పు రాలేదు. రాకపోగా, పరిస్థితి నానాటికీ దిగజారింది. ఈ క్రమంలో పోరాటాల ఖిల్లా అయిన తెలంగాణే తన నమూనాను దేశవ్యాప్తం చేయాల్సిన అవసరముంది. కేసీఆర్ గారు  జాతికి మార్గం చూపాల్సిన అవసరం ఉంది.’’