Telangana News: విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్‌ వస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలుకుతూ ఓఆర్ఆర్ పై స్వాగత బ్యానర్లు వెలిశాయి. వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటూ ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్.. ఔటర్ రింగ్ రోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయించారు. లండన్, అమెరికా దేశాలలో పర్యటించి 42 వేలకు పైగా ఉద్యోగ కల్పన తో తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. 


















రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా సాగింది కేటీఆర్‌ పర్యటన. బ్రిటన్, అమెరికా పర్యటన వేళ పలు ప్రపంచ దిగ్గజ సంస్థలను కలిశారు కేటీఆర్. వాళ్లంతా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు రూ.5800 కోట్లకుపైగా పెట్టుబడులను ప్రకటించినట్టు తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మరికొన్ని రోజుల్లో స్పష్టం రానుంది.


కేటీఆర్ తన సమవేశం 80కిపైగా బిజినెస్‌ సమావేశాలు నిర్వహించారు. పలు బిజినెస్ రౌండ్‌ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక మందితో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న వనరులు, అనుకూల పరిస్థితులను వారికి వివరించారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న సంస్థల పురోగతిని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వాళ్లకు వివరించారు.


తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావించిన సంస్థలు హైదరాబాద్‌ సహా కరీంనగర్ ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. ఈ పర్యటనలో వచ్చిన సంస్థలతో దాదారు నలభై వేలకుపైగా ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.