Telangana: తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు రిటైర్ అయ్యే టైంలో ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలను రెట్టింపు చేస్తామన్నారు. ఇకపై వారికి రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తున్నామి ఇకపై వారికి రూ.లక్ష అందిస్తామని పేర్కొన్నారు.
ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూపులు
అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపునకు సంబంధిన ప్రతిపాదలను ఇప్పటికే ఆర్థికశాఖకు పంపించామని సభలో సీతక్క వెల్లడించారు. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పెంపు ఉత్తర్వులు జారీ చేసి బెనిఫిట్స్‌ను అమలు చేస్తామని తెలిపారు.
ఈ మధ్యే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచినట్టు ప్రకటించింది. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీ చేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా మెడికల్ సర్టిఫికేట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
ఇప్పుడు పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు 2 లక్షలు, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తామని తాజాగా చెప్పింది. సర్వీసులో ఉన్న అంగన్‌వాడీ టీచర్ మరణిస్తే రూ.20 వేలు, మినీ అంగన్‌వాడీ టీచర్/హెల్పర్‌కు రూ.10 వేలు దహన సంస్కారాల కోసం అందజేయనున్నామని తెలిపారు. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయిని కూడా పెంచారు.
గత ప్రభుత్వ నిర్ణయమే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు మూడుసార్లు వేతనాలను పెంచింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచారు. పదవీ విరమణ సమయంలో ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇచ్చే నగదును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పెంచింది. 50 ఏళ్ల లోపు వయసున్న వారికి రూ.2 లక్షల బీమా, 50 దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కూడా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ టీచర్లు రూ.7,800లు, హెల్పర్లు రూ.7,800 వేతనంగా ప్రభుత్వం ఇస్తోంది.
దీంతోపాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
Also Read: అక్కలను నమ్మొద్దు, కేటీఆర్‌కు రేవంత్ సూచన- సబితా సీరియస్- తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం