అజీమ్ ప్రేమ్‌జీ లాంటి వ్యక్తి మన మధ్య ఉండటం చాలా గొప్ప విషయమన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈసిటీలో విప్రో సంస్థకు సంబంధించిన మరో కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్బంగా అజీమ్ ప్రేమ్‌జీ జీవితంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేటీఆర్.
విప్రో సంస్థ విస్తరణలో భాగంగా మహేశ్వరంలోని ఈసిటీలో పరిశ్రమ ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ వల్ల స్థానికంగా ఉన్న కందుకూరు, మహేశ్వరం ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు మంత్రి కేటీఆర్. నేటి యువత అజీమ్ ప్రేమ్‌జి లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలాన్నారు కేటీఆర్. ఆయన జీవితం అందరికీ అనుసరణీయమన్నారు. మంచి పాఠం లాంటి వ్కక్తి అని కొనియాడారు కేటీఆర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందరికీ ఆదర్శం అవుతుందన్నారు.
దాదాపు 300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని.. కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్టు కేటీఆర్ వివరించారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నాయన్నారు.
కరోనా టైంలో కూడా అజీమ్ ప్రేమ్ జీ చేసిన సేవలను కొనియాడారు కేటీఆర్. తెలంగామలో ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అజీమ్ ప్రేమ్‌జీని రిక్వస్ట్ చేశారు కేటీఆర్.
అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ విధానాలు కితాబు ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేలా ఇక్కడ పరిస్థితులను ప్రోత్సహిస్తున్నారన్నారు. అందుకే మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచనతో ఉన్నామని.. ఇక్కడ యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించనున్నట్టు పేర్కన్నారు అజీమ్ ప్రేమ్‌జీ.
ఇలాంటి కంపనీలు రావడంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కామెంట్ చేశారు. ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ఒప్పందాలు జరిగాయని అది మంచిదన్నారు. ఈ అవకాశాలను స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆకాక్షించారు.