Telangana Assembly Sessions - హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించగా, కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చెప్పారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఓఆర్ఆర్ (Hyderabad ORRను కమీషన్లకు కక్కుర్తి పడి 7300 కోట్లకు ఓ సంస్థకు కట్టబెట్టిన ఘనమైన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి దరఖాస్తులు తీసుకుని, ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాంటి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం కోసం భూముుల వేలంపై మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు.
గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. అయితే ఈ రోడ్లపై తమకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హామ్ విధానంలో రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అయితే కాంట్రాక్టర్లకు 3 నెలలకు లేక 6 నెలలకు చెల్లిస్తామన్నారు. ఈ రోడ్లపై టోల్ టాక్స్ విధించే ఆలోచన లేదన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ రోడ్లు వేయనుంది. బీఆర్ఎస్ పాలనలో కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే మంచిగా రోడ్లు వేశారని, రాష్ట్రాన్ని విస్మరించారని విమర్శించారు. సింగరేణి నిధులు కూడా ఆ 3 ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి వాడారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల నిర్మాణంపై చర్చకు సిద్ధమా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని మాజీ మంత్రి హరీష్ రావుకు విసిరారు. సవాల్ ను స్వీకరించిన హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో లెక్కలు పరిశీలిద్దాం అన్నారు. అవసరమైతే ఒకరోజు చర్చ జరుపుదామని సూచించారు.