యాసంగిలో సేకరించిన ధాన్యం అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్న సంస్థలు ఇవాళ్టి(22 వ తేదీ) నుంచి 15 రోజుల పాటు టెండర్లు దాఖలు చేయవచ్చు.  సెప్టెంబర్‌ ఐదోవ తేదీ మూడు గంటలకు టెండర్లను తెరవనున్నారు. 


యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇలాంటి విధానంలో ధాన్యాన్ని అమ్మబోతున్నామని అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాత పౌరసరఫరాల శాఖ, ఆర్థిక అనుమతితో ఫైల్ సిద్ధం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. 


ముందుగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఈ గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ నోటిఫికేషన్‌ను పౌరసరఫరాల సంస్థ జారీ చేసింది. 15 రోజుల పాటు జరిగే టెండర్ల ప్రక్రియలో రైస్ మిల్లర్లతోపాటు ఎవరైనా పాల్గొనే ఛాన్స్‌ ఇచ్చారు. దీనిపై త్వరలోనే ప్రీబిడ్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. 


ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 22 వేల కోట్ల విలువైన ధాన్యం ఉన్నాయి. వీటిని ఖాళీ చేస్తే కానీ వచ్చే భవిష్యత్‌లో రాబోయే పంటను కొనే పరిస్థితి లేదు. అందుకే ఈ విధానంలో అమ్మకాలు చేపట్టబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించిందని అందుకే గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి వచ్చే స్పందన బట్టి విడతల వారీగా మిగిలిన ధాన్యాన్ని కూడా ఇదే విధానంలో అమ్మకాలు చేయబోతున్నట్టు తెలిపారు.  


దేశంలో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ఈ గ్లోబల్ టెండర్ విధానం అమల్లో ఉంది. అక్కడ మూడేళ్ల నుంచి ఈ విధానంలో అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో తొలిసారిగా అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇది విజయవంతమైతే