Rahul Gandhi Election Campaign in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. నవంబర్ 17న హైదరాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ రేపు ఒక్కరోజే ఏకంగా 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకోనున్నారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పినపాక నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేటలో రాహుల్ గాంధీ ఉండనున్నారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.
వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్ నియోజకవర్గానికి అక్కడి నుంచి రాహుల్ గాంధీ వెళ్తారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్ రానున్నారు. రాజేంద్రనగర్ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లిపోనున్నారు.
రేపు ఖర్గే పర్యటన కూడా..
రేపు (నవంబరు 17) హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఖర్గే బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఖర్గే చేరుకొనున్నారు. ఉదయం 11 గంటలకు ఖర్గే గాంధీ భవన్‌కు చేరుకొని.. 11 గంటలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొననున్నారు. సమావేశం తర్వాత హైదరాబాద్ లోనే ఖర్గే బస చేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు తిరిగి ఖర్గే బెంగళూరుకు వెళ్లనున్నారు.