Telangana Job Calendar: తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Job Calendar in Telangana | బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నా నిరుద్యోగులకు న్యాయం చేయలేదని, పలుమార్లు గ్రూప్ 1 సహా ఇతర నియామక పరీక్షలు నిర్వహించి, రద్దు చేశారని భట్టి విక్రమార్క అన్నారు.

Continues below advertisement

Bhatti Vikramarka statement on Job Calendar in Telangana | హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్దం పాటు అధికారంలో ఉన్నా, నిరుద్యోగులకు న్యాయం జరగలేదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడంలో భాగంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో జాబ్ క్యాలెండర్ పై భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అయిందని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మార్చారని ఆరోపించారు. 

Continues below advertisement

గ్రూప్ 1 సజావుగా నిర్వహించాం 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్ లతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి, వారి సూచనల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి, 60 కొత్త పోస్టులతో మొత్తం 563 పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 3 లక్షల మంది హాజరుకాగా, పరీక్ష సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటించామన్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 

అభ్యర్థులు కోరడంతోనే గ్రూప్ 2 వాయిదా 
‘ఒక లక్షా 45 వేల 368 మంది హాస్టల్ వేల్ఫెర్ ఆఫీసర్ పరీక్షలకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ కు 1 లక్షా 6 వేల 2 వందల 60 మంది హాజరుకాగా, విజయవంతగా నిర్వహించాం. 32 వేల 4 వందల 10 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశాం. అదనంగా 13,500 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చాం. 11 వేల 62 ఖాళీలతో టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ ఎగ్జామ్ ప్రకటించాం. జులై 18న ప్రారంభమై ఆగస్టు 5న ముగియనున్నాయి. 465 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీకి, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాం. పరీక్షల ప్రిపరేషన్ కు తగినంత సమయం లేదని అభ్యర్థులు కోరడంతో ఆగస్టు నుంచి డిసెంబర్ కు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశాం. పరీక్షా తేదీలు ఒకటే కాకుండా, పరీక్షల మధ్య ప్రిపరేషన్ కు సమయం ఉండేలా అన్ని నియామక బోర్డులు ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాయని’ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రకటించారు.

గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీక్, ఎగ్జామ్ రద్దు 
‘గత ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల పేపర్లు లీకయ్యాయి, పేపర్ల అమ్మకంతో పరీక్షలు రద్దయ్యాయి. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17న తొలిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దయింది. అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోని కారణంగా హైకోర్టులో రెండోసారి ఎగ్జామ్ రద్దు అయింది. ప్రస్తుతం ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, కొత్త చైర్మన్ ను నియమించి వరుసగా పోస్టుల భర్తీని పూర్తి చేశాం. పాత నోటిఫికేషన్లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి, ఎగ్జామ్స్ సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తున్నామని’ భట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Also Read: మరోసారి ఎమ్మెల్సీల వివాదం - కేబినెట్ సిఫార్సులు ఆమోదించవద్దని గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ !

Continues below advertisement