India Pakistan Attack News : భారత సరిహద్దుల్లో సైన్యం వీరోచితంగా పోరాడుతోంది. పాకిస్థాన్ దుశ్చర‌్యలను బోర్డర్‌లోనే భూస్థాపితం చేస్తోంది. ఇలాంటి సందర్భంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. తన మనసులోని మాటను ప్రజాప్రతినిధులకు చెప్పారు. 

Continues below advertisement


దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న సైన్యం కోసం సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నేషనల్ డిపెన్స్‌ ఫండ్‌కు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.  


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చించారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించనున్నారు. ఈ చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారి అంగీకరించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.  ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చేలా పిలుపునివ్వనున్నారు.  


మరోవైపు సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు కారణంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రివ్యూ నిర్వహించింది. సరిహద్దుల్లో ఉన్న వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనవసరమైన ప్రచారం నమ్మి ఇబ్బంది పడుతున్నవారికి సకాలంలో సాయం చేసేందుకు  ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేయనుంది.  దీనికిసంబంధించిన నెంబర్లను కూడా అధికారులు వెల్లడించారు. 011-23380556, వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ - మొబైల్: 9871999044, హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ పీఏ -: 9971387500, జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ -: 9643723157, సీహెచ్. చక్రవర్తి, పీఆర్వో: 9949351270 నెంబర్లకు ఫోన్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.  


ఏపీ భవన్‌లో కూడా ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు.   011-23387089, 98719 99430, 98719 99053, డిప్యూటీ కమిషనర్‌ నంబర్‌ 98719 90081, లైజన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 9818395787కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.