భారీ కాన్వాయ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్రలోని సోలాపూర్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బస్సులో భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో ప్రగతి భవనం నుంచి పయనమయ్యారు. దాదాపు 600 వాహనాలు ఆయనతో కదిలారు. కేసీఆర్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారు. 


సోలాపూర్‌ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ధారాశివ్‌ జిల్లా ఒమర్గా వద్ద లంచ్‌ చేసి అక్కడ కాసేపు రెస్టు తీసుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ బయల్దేరి రాత్రికి సోలాపూర్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం పండరీపురం చేరుకుంటారు. 






పండరీపురంలో విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం కేసీఆర్. ఆయనతోపాటు మంత్రులు, ఇతర బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పూజల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత సోలాపూర్‌లోని సర్కోలి గ్రామానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 


ఈ సభ సాక్షిగా భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. అక్కడ సభ ముగిసిన వెంటనే తిరుగు పయనమవుతారు. ఈ క్రమలోనే ధారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.