ఇద్దరి కుర్రాళ్లు ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకున్నారు. ఒకరోజు పాటు అక్కడ గడిపారు. ఆ స్నేహితులు సుమారు 24 లీటర్ల నీరు తాగారు. అదే వాళ్లల్లో మార్పును తీసుకొచ్చింది. ఆలోచనను మార్చేసింది. తామే ఒక్కరోజులు ఇన్ని ప్లాస్టిక్‌ బాటిళ్లు వాడితే దేశవ్యాప్తంగా ఎన్ని బాటిళ్లు ఖర్చు అవుతున్నాయో అని ఆశ్చర్యపోయారు. ఇది మనుషులకు ఎంత ప్రమాదమో గుర్తించారు. 


ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఐటీ జాబ్‌కు రిజైన్ చేశారు. రోజుల కొద్ది ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి చివరకు ఒక ఉపాయం కనుగొన్నారు. ఎక్కడికైనా తీసుకెళ్లేలా, ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అలా వారికి వచ్చిన ఆలోచనే పేపర్‌ బాక్స్‌, అందులో నీటి నిల్వ చేసేలా ప్రయత్నించి విజయవంతమయ్యారు. వాళ్లే సునీత్‌ తాతినేని, అతని స్నేహితుడు చైతన్య అయినపూడి. 


కొన్ని రోజుల మథనం తర్వాత వారి మెదళ్లలో పుట్టిన ఆవిష్కరణ కారో వాటర్‌. ఇది దేశంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్. కారిగేటెడ్‌ పేపర్‌ ఉపయోగించి టేంపర్‌ప్రూఫ్‌ వాటర్‌ బాక్స్‌ తయారు చేశారు. BIB అంటే బాక్స్‌లో బాక్స్ అనే పద్ధతిలో దీన్ని రూపొందించారు. 


ఇందులో 85శాతం వరకు ప్లాస్టిక్‌ లేకుండా ఈ కారో బాక్స్‌ తయారు చేశారు. దీన్ని రిసైకిల్‌ చేసేలా తయారు చేశారు. దీన్ని యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్లే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అది ఎక్స్‌పయిరీ అయిపోయాక దాని ప్లేస్‌లో కొత్తది ఇచ్చి పాతది తీసుకెళ్లిపోతారు. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టు సునీత్‌ చెబుతున్నారు. 



వీళ్లు తయారు చేసిన కారో బాటిల్‌ సుమారు రెండు వందల నుంచి మూడు వందల లీటర్లు నీటిని వడపోస్తుంది. వాటల్ బాటిల్స్‌ కారణంగా మైక్రో ప్లాస్టిక్‌  శరీరంలోకి వెళ్తుందని చాలా పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. దీని కారణంగా కొన్ని జబ్బులు వస్తున్నట్టు కూడా స్టడీ చెబుతున్నాయి. అందుకే అలాంటి సమస్యలేకుండా పేపర్‌తో కార్గో బాక్స్ తయారు చేసినట్టు సునీత్‌ వెల్లడించారు. 


సాధారణ వాటర్ క్యాన్‌లతో పోలిస్తే 85% తక్కువ ప్లాస్టిక్‌ను ఈ కారో వాటర్‌ బాక్స్‌ల్లో వాడుతున్నాడు. వినియోగదారుడు కారో వాటర్ బాక్స్‌ను ఆర్డర్ చేసి, దాన్ని ఉపయోగించిన తర్వాత మళ్లీ వాటిని తిరిగి అప్పగించేస్తారు. కారో వాటర్ యాప్ ద్వారా ప్రక్రియ సాగుతుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు క్రెడిట్ పాయింట్‌లు పొందుతారు. వినియోగదారులు తమ బాక్స్‌లను డెలివరీ చేయడానికి పదే పదే కాల్ చేయాల్సిన అవసరం లేదని యాప్ డెలివరీ సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు సునీత్‌. 


ఐదు లీటర్ల బాక్స్‌ ప్రైస్‌ 75 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇరవై లీటర్ల బాక్స్‌ తీసుకోవాలంటే 120 రూపాయాలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో  బిపిఎ  లేదా బిస్ఫినాల్ఎ కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్టు సునీత్‌ చెప్పారు. 


ప్రస్తుతం కారో వాటర్ ప్యూరిఫైర్‌ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే సేవలు అందిస్తోంది. సేవలు విస్తరించి పెట్టుబడులు ఆకర్షించేందుకు బెంగళూరులో కూడా ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించారు. 


కారో బాక్స్‌లో కేవలం ట్యాప్‌లోనే ప్లాస్టిక్ ఉంటుంది. యాభై గ్రాముల కంటే తక్కువ. కార్టన్ బాక్సులు సేకరించి  రీసైకిల్ చేయడం చాలా టఫ్‌ జాబ్‌. వినియోగదారుల నుంచి తీసుకునే కారో బాక్స్‌లను వేరు చేసేందుకు రీసైక్లింగ్ యూనిట్స్‌ సేవలను వీళ్లు వాడుకుంటున్నారు. 


ప్లాస్టిక్ వినియోగం వీలైనంత వరకు తగ్గించడమే తమ టార్గెట్‌ అని చెబుతున్నారు సునీత్‌.