TGPSC Group-1 : తెలంగాణలో వివాదంగా మారుతున్న గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. డివిజన్ బెంచ్‌ ఉత్తర్వులు మేరకే తదుపరి ప్రక్రియ ఉండాలని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులతో జరుగుతున్న ప్రక్రియను ఆపాలని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన అత్యున్నత ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నియామకపత్రాలు జారీ చేయడాన్ని కూడా అడ్డుకోలేమని పేర్కొంది.