ఇంట్లో పని చేసే బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. న్యాయవాదులుగా పని చేస్తున్న తండ్రీ కుమారుడు ఇంట్లో పని చేస్తున్న బాలికపై అత్యాచారం చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కోర్టులో ట్రయల్ నడిచింది. 


ఈ కేసులో రెండు పక్షాల వాదనలు విన్న ఎల్బీనగర్‌ పోక్సో కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. న్యాయవాదులుగా పని చేస్తున్న మేడిపల్లి భరత్, ఆయన తండ్రి మేడిపల్లి సధాకర్‌ ఇంట్లో పని చేస్తున్న బాలికపై అత్యాచారం చేశారని అభియోగాలు నమోదు అయ్యాయి. 


బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జరిగింది వాస్తవమేనని తెల్చారు. దీంతో కోర్టులో వాదనలు నడిచాయి. నమ్మి ఇంట్లో పనికి వచ్చిన బాలికపై అత్యాచారం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. 


ఇరు పక్షాల వాదనలు విని, సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. కుమారుడు భరత్‌కు యావత్‌జీవిత శిక్ష విధించింది. తండ్రి మేడిపల్లి సుధాకర్‌కు ఏడేళ్ల పాటు శిక్ష వేసింది. అంతే కాకుండా బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది.