Secunderabad To Goa Train: హైదరాబాద్‌: సెలబ్రిటీలుగానీ, యువత, ఉద్యోగులు, వ్యాపారులు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. బట్ సెలబ్రిటీలకు, సౌండ్ పార్టీలకు గోవా ట్రిప్ ప్లాన్ చేయడంతో పాటు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఈజీగా వెళ్లొస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో  గోవాకు వెళ్లే రైలును ఆదివారం నాడు ప్రారంభించారు.


సికింద్రాబాద్ నుంచి రైలు 17039 సర్వీస్


సికింద్రాబాద్ నుంచి గోవా(వాస్కోడగామా)కు వెళ్లే ఈ కొత్త రైలు సర్వీసు హైదరాబాద్ నుంచి అక్టోబర్ 9, గోవాలోని వాస్కోడగామా నుంచి అక్టోబర్ 10వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇదివరకు ఈ మార్గంలో రైలు సర్వీసు లేదా అంటే ఉంది. సికింద్రాబాద్‌- వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసు (ట్రెయిన్ నెంబర్ 17603) మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారాల్లో సేవలు అందిస్తోంది. అయితే హైదరాబాద్, తెలుగు ప్రాంతాల నుంచి గోవాకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రైలు సర్వీసు ప్రారంభించారు. ఆ (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామాకు బయలుదేరుతుంది. అదే విధంగా (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తాజా రైలు సర్వీసులతో దేశంలో పర్యాటకానికి మరింత తోడ్పాడు అందుతుందని, దాంతోపాటు ఇక్కడి నుంచి గోవాకు వెళ్లే వారికి రైలు ప్రయాణం ఈజీ అవుతుంది.






గోవాకు రైలు సర్వీసుపై ప్రయాణికులు హర్షం


సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య రైలు సర్వీసుపై హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా తక్కువ సమయంలో గోవాకు వెళ్లాలంటే విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే కొంచెం ఖర్చు తగ్గించుకుని మనమే వాహనాలు బుక్ చేసుకుని గోవాకు వెళ్లాల్సి వస్తుంది. అయితే తాజాగా ప్రవేశపెట్టిన గోవా రైలు సర్వీసులో తొలిసారి గోవాకు వెళ్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైలు సర్వీసుతో తక్కువ ధరకే రైలు టికెట్ కొని గోవాకు వెళ్తున్నామని కొందరు ప్రయాణికులు తెలిపారు.


రైలులో సౌకర్యాలు బాగున్నాయని, గోవాకు వెళ్లాలనుకున్న తమ కల నెరవేరిందని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రైలు అనగానే సామాన్యుడి వాహనం అని, సామాన్యుడి విమానం అని ఎన్నో చెబుతుంటారు. ఎందుకంటే తక్కువ ధరలకే సుదూర ప్రయాణాలు చేసేవారు కచ్చితంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. విమానంతో పోల్చితే తక్కువ ధరలకే కుటుంబం మొత్తం ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు అని చెబుతున్నారు.