Schneider Electric Hyderabad: తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ పరిశ్రమ వచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్.. హైదరాబాద్ లో భారత్ లోనే అతిపెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ష్నైడర్ కంపెనీ ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మరో అంతర్జాతీయ కంపెనీ రాష్ట్రానికి రావడం ఆనందంగా ఉందని మంత్రి కె. తారక రామారావు అన్నారు.


దేశంలోని అతి పెద్ద ఫ్యాక్టరీని హైదరాబాద్ నగరంలోనృ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ  సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్ ను ఆయన కోరారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 ఫ్రెంచ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని.. ఇది సంతోషించే విషయంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 75 శాతం ష్నైడర్ ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు హైదరాబాద్ లో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ఇండో - ఫ్రెంచ్ ఛాంబర్ ని ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు. 


దేశంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీని ష్నైడర్ సంస్థ రూ. 300 కోట్ రూపాయలతో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఇండస్ట్రీయల్ పార్కు వద్ ఆ కొత్త కంపెనీ రూపుదిద్దుకుంటోంది. 


దావోస్ భేటీలో ఒప్పందం


తెలంగాణకు విదేసీ పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది మే నెలలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో మంత్రి కేటీఆర్ అధికారుల బృందంతో పాల్గొన్నారు. ఈ సందర్భం పలు విదేశీ కంపెనీల ప్రతినిధులను కలిసి తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల గురించి క్లుప్తంగా చెప్పారు. కేటీఆర్ ప్రతిపాదనలు విన్న పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆనాడు సుముఖత వ్యక్తం చేశాయి. పలు కంపెనీలు ఒప్పందాలు కూడా చేసుకోవడం విశేషం. దావోస్ పర్యటనలో భాగంగా ష్నైడర్ ప్రతినిధులు తెలంగాణలో తమ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.   తెలంగాణలో ష్నైడర్ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వెయ్యి కోట్ల రూపాయలతో ష్నైడర్ ఎలక్ట్రికల్ సంస్థ తమ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ ప్రకటన చేశారు. 


ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే ఆత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అడ్వాన్స్డ్ లైట్ హౌజ్ అవార్డును పొందిందని రిమోంట్ తెలిపారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయన్నారు.