Sania Mirza: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమె ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మార్చి 5వ తేదీన జరిగిన పేర్ వెల్ ఎగ్జిబిషన్  మ్యాచ్ లో పాల్గొంది. సింగిల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్ లో సానియావిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది.


తన 20 ఏళ్ల ప్రయాణంలో జరిగిన సంఙటనలు గుర్తు చేసుకొని కంటతడి పెట్టింది. ఈ క్రమంలోనే సానియా కుమారుడు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో.. స్టేడియం మొత్తం హర్షద్వానాలతో దద్దరిల్లింది. సానియా క్రీడాకారిణిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రాంతంలోనే తిరిగి ముగించింది. సానియా ఆడే చివరి మ్యాచ్ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్, బాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియంకు వచ్చారు. ఈరోజు ఫెర్ వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ కు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సానియా మీర్జాను సత్కరించారు. మ్యాచ్ కోసం వచ్చిన మంత్రి రిజుజుకు సానియా మీర్జా ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది.






 






"20 ఏళ్లుగా దేశం తరఫున ఆడడం నాకు దక్కిన గొప్ప గౌరవం. తమ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిత్యం వహించాలనేది ప్రతి క్రీడాకారణి కల. నేను అలా చేయగలిగాను. ఇవి చాలా చాలా సంతోషకరమైన కన్నీళ్లు. ఇంతకంటే మించి సెండ్ ఆఫ్ కోసం నేను ఆడగలేకపోయాను." - సానియా మీర్జా, టెన్నిస్ క్రీడాకారిణి


ఈరోజు జరిగే పార్టీకి సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం..  


టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహ్మ్ అజహూరుద్దీన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఈ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆదివారం సాయంత్రం ఓ ప్రవేట్ హోటల్ లో జరిగే రెడ్ కార్పెట్ ఈవెంట్ కు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.


ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ సానియా మిర్జా 
సానియా మీర్జా తన కెరీర్‌లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. మార్టినా హింగిస్‌తో కలిసి మూడు ఉమెన్స్ డబుల్ టైటిల్స్ గెలిచింది. మరో మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్స్ కైవసం చేసుకుంది. ఇందులో రెండు మహేష్ భూపతితో కలిసి సాధించింది. అలాగే 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచిన సానియా మీర్జా.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా రెండు పతకాలు సాధించింది. ఒలింపిక్స్ పతకం కోసం శ్రమించినా అది కలగానే మిగిలింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది సానియా మీర్జా.