కేంద్ర ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్‌లో రైతులను దారుణంగా చంపేసిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రైతుల సమస్య ఉండేది కాదని అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌన దీక్ష చేపట్టారు. లఖీంపూర్ ఘటనకు వ్యతిరేకంగా వారు ఈ నిరసన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్ సమస్య కాదని.. 80 శాతం మంది రైతుల సమస్య అని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది రైతులను కేంద్ర ప్రభుత్వం బానిసలుగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ
వ్యవసాయ చట్టాల ద్వారా రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారని.. దీనిపై రైతులు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారని.. అలాంటప్పుడు ఢిల్లీకి వెళ్లి మోదీతో ఎందుకు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేసీఆర్‌కు చలి జ్వరం పట్టుకుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోదీకి కనీసం కనిపించడం లేదా అని నిలదీశారు.
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
దేశ ప్రజల మన్ కీ బాత్‌ను మోదీ వినాలని రేవంత్ హితవు పలికారు. సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని గుర్తు చేశారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మోదీ, కేసీఆర్‌ను బొంద పెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుందని అన్నారు. మోదీ, అమిత్ షా రైతుల హత్యలను ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.