Ravi Raheja Donation To Telangana CMRF: తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి సహాయార్థం తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళం వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ సీఎం సహాయనిధికి ఏకంగా రూ.5కోట్లు భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కె.రహేజా కొర్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం చెక్కును అందజేశారు. 


తెలంగాణ సీఎం సహాయనిధి (TGS CMRF)కి VIT (Vellor Institute Of Technology) రూ.1.50 కోట్ల విరాళం అందించింది. విట్ ఫౌండర్ &చాన్స్ లర్ డాక్టర్ జి.విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ రూ.1.50 కోట్ల విరాళం చెక్కు రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.


వరద బాధితులను ఆదుకునేందుకు KNR కన్ స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణ సీఎం సహాయనిధికి ఆ సంస్థ ఎండీ నర్సింహా రెడ్డి, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ జలంధర్ రెడ్డి రూ.2 కోట్లు విరాళం అందించారు.


సీఎం సహాయనిధికి NCC( Nagarjuna Construction Company Ltd) రూ.కోటి విరాళం అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు ఎన్సీసీ ఎండీ రంగరాజు, డైరెక్టర్ సూర్య.


జీఎంఆర్ గ్రూపు రూ.2.5 కోట్లు విరాళం  
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎం సహాయనిధి (Telangana CM Relief Fund)కి రూ.2 కోట్ల విరాళం ఇచ్చింది. కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, కొందురు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విరాళం చెక్కును అందించారు.  వరద బాధితులను ఆదుకోవడానికి పలు సంస్థలు, ప్రతినిధులు తమవంతు సహాయం ప్రకటిస్తున్నారు. జీఎంఆర్ గ్రూపు సంస్థ వరద బాధితుల కోసం రూ. 2.5 కోట్లను విరాళంగా అందజేసింది. విర్చో ల్యాబరేటరీస్ సంస్థ రూ.1 కోటి చెక్కును శుక్రవారం నాడు అందజేసింది.  కెమిలాయిడ్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ కె.రంగరాజు రూ.1 కోటి చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎండీ రాయల రఘు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.1 కోటి చెక్కును విరాళంగా అందించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు కోటి రూపాయలు విరాళం అందించాయి.  అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతా రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.


Also Read: వానలు ఆగాలని చిలుకూరు బాలాజీకి భక్తుల ప్రదక్షిణలు, అర్చకుల ప్రత్యేక పూజలు


మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మారింది. ఇది వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ సెప్టెంబర్ 9వ తేదీకి ఒడిస్సా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.