Hyderabad Outer Ring Rail Project: హైదరాబాద్‌లో మరో బృహత్తర ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం సిద్దమైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇప్పుడు దాని చుట్టూ మరో రీజినల్ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను రైల్వే శాఖ రెడీ చేస్తోంది. 


హైదరాబాద్‌ చూట్టూ 75 కిలోమీటర్ల పరిధిలో తొలి ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు నిర్మించాలని ఎప్పటి నుంచో ప్లాన్స్‌ ఉన్నాయి. ఆలోచనలు దాటి అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు దాన్ని స్పీడప్ చేయడానికి పై స్థాయి నుంచి ఆదేశాలు రావడంతో ప్రక్రియ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఫైనల్‌ లొకేషన్ సర్వే పూర్తి చేసింది రైల్వే శాఖ. ఇకి డీపీఆర్ సిద్ధం చేయనుంది. ఇప్పటికి చేసిన సర్వే ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు 13 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. 


ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే మాత్రం దేశంలోని తొలి ప్రాజెక్టు కానుంది. కొత్త నిర్మించబోయే ట్రిపుల్ ఆర్‌కు చుట్టూ దీన్ని చేపట్టనున్నారు. రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో దీన్ని రూపొందించనున్నారు. ఇది ఆరు ప్రాంతాల్లోనే రైల్వే లైన్‌లు దీంతో అనుసంధానం కానున్నాయి. ఇంతటి బృహత్త ప్రాజెక్టు డీపీఆర్‌ను రెడీ చేస్తున్న రైల్వేశాఖాధికారులు జూన్‌ నాటికి తుది నివేదిక సమర్పించనున్నారు.  


Also Read: గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల విండో ఓపెన్, అబ్జెక్షన్స్ ఇలా నమోదు చేయాలి


ఆ ఆరు క్రాసింగ్ ప్రాతాలు ఇవే  


వలిగొండ వద్ద సికింద్రాబాద్‌–గుంటూరు రైల్వేలైన్‌ను, వంగపల్లి వద్ద సికింద్రాబాద్‌–వరంగల్‌ లైన్‌ను, గుల్లగూడ వద్ద సికింద్రాబాద్‌–తాండూరు లైన్‌ను, మాసాయిపేట వద్ద సికింద్రాబాద్‌–నిజామాబాద్‌ లైన్‌ను, బాలానగర్‌ వద్ద కాచిగూడ–మహబూబ్‌నగర్‌ లైన్‌ను గజ్వేల్‌ వద్ద సికింద్రాబాద్‌–సిద్దిపేట లైన్‌ను క్రాస్ చేసే అవకాశం ఉంది.  


దీని వల్ల ప్రయోజనం ఏంటీ 
ఇప్పుడు హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు పెరిగడంతో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. భారీ వాహనాల రాకతో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. దీన్ని తగ్గించడానికి వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలు భారీ వాహనాల నియంత్రణకు ట్రిపుల్ ఆర్‌ను నిర్మిస్తున్నారు. అలాంటిదే హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆ స్టేషన్‌లకు వచ్చే గూడ్స్ రైళ్లను, ఇతర చిన్నలింక్ రైళ్లను ఈ ఔటర్ రింగ్‌ రైలు ట్రాక్‌లోనే నిలిపివేయనున్నారు. 


ఇంతటి ప్రయోజనం ఉన్న పాతిక స్టేషన్‌లతో నిర్మితమయ్యే ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుకు అయ్యే భూసేకరణ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల నిడివితో దీన్ని నిర్మిస్తారు. వెడల్పు 80 మీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికే ట్రిపుల్ ఆర్‌కు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఔటర్‌ రింగ్ రైలు ప్రాజెక్టు భూములు ఇస్తారా అనేది అనుమానంగానే ఉంది. ఇది పెద్ద సమస్యగా మారబోతోంది.  


Also Readఅఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!