TGPSC Group2 Answer Key: తెలంగాణలో 'గ్రూప్‌ -2' పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని టీజీపీఎస్సీ జనవరి 18న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ప్రశ్నపత్రంతోపాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. అభ్యంతరాల నమోదు కోసం ప్రత్యేక వెబ్ లింకును టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఈ అభ్యంతరాలను ఇంగ్లిష్‌లో మాత్రమే నమోదు చేసి, ఆధారాలను జత చేయాలని టీజీపీఎస్సీ సూచించింది. పోస్టు/వాట్సప్‌/ఎస్‌ఎంఎస్‌/ఫోన్‌/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.. 

గ్రూప్- 2  ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

✦ అభ్యర్థులు https://websitenew.tspsc.gov.in/ అధికారక వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.

✦ గ్రూప్-2 పరీక్ష ఆన్సర్ కీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

✦ అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదు చేయాలి.

✦ డేటా పై క్లిక్ చేస్తే ప్రిలిమినరీ కీలతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం ఓపెన్ అవుతుంది.

✦ ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీలను పొందవచ్చు.

ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు...

✦ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్‌లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.

✦ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్ లేదా ఇతర రాతపూర్వక మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోరు.

✦ అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్‌ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.

✦ అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి అభ్యంతరాలు సమర్పించాలి. 

✦ ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలు నమోదుచేయాలి.

Web Note

Website

తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి 2022, డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  పేపర్-2 పరీక్ష నిర్వహించారు.

గ్రూప్-2 పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ పై పరీక్ష మొదటి సెషన్ లో ఉంటుంది. పేపర్‌-2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ పరీక్షను సెషన్‌-2లో నిర్వహిస్తారు. పేపర్‌-3లో ఎకానమీ & డెవలప్‌మెంట్‌ పై ఉండనుంది. ఇది  జనవరి 16న మొదటి సెషన్‌లో నిర్వహించారు. ఇక పేపర్‌ 4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణపై ప్రశ్నలు ఉండగా.. దీన్ని 16న రెండో సెషన్‌లో నిర్వహించనున్నారు.

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Group2 Revised Breakup

Group2 Notification

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...