లెజెండరీ నటుడు మోహన్ బాబు తనయులు - మంచు బ్రదర్స్ విష్ణు (Vishnu Manchu), మనోజ్ (Manchu Manoj) మధ్య గొడవ సోషల్ మీడియాకు ఎక్కింది. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదని కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థం అవుతోంది. ఇద్దరి మధ్య గొడవ శుక్రవారం (జనవరి 17న) మరింత దారుణంగా తయారైంది. ఒకరినొకరు 'కుక్క' అని తిట్టుకున్నారు. అది పక్కన పెడితే... ఈ రోజు అన్నయ్య విష్ణుకు తమ్ముడు మనోజ్ మరొక సవాల్ విసిరారు. 


నేను ఒక్కడినే వస్తా... నువ్వు ఎవరితో వస్తావో రా!?
అన్నయ్య విష్ణు మంచుకు విస్మిత్ (VisMith) అని పేరు పెట్టారు మనోజ్. ఈ రోజు ఉదయం ''విష్ణు... నువ్వు చాలా క్యూట్. కలసి కూర్చుని మాట్లాడుకుందాం. మ్యాన్ టు మ్యాన్ (మనం ఇద్దరమే కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్లు). ఇంట్లో ఆడవాళ్లను, నాన్నను, సిబ్బందిని పక్కన పెట్టేసి మనం మాట్లాడుకుందాం.‌ నువ్వు ఏం అంటావ్?'' అని ట్విట్టర్ వేదికగా అన్నయ్యకు సవాల్ విసిరారు తమ్ముడు.


అక్కడితో ఆగలేదు... ''నేను ఒక్కడినే వస్తానని ప్రామిస్ చేస్తున్నా. నువ్వు ఎవరిని తెచ్చుకోవాలని అనుకుంటావో వాళ్ళని తెచ్చుకో.‌ మన ఇద్దరం కలిసి హెల్దీ డిబేట్ (ఆరోగ్యకరమైన చర్చలు) జరుపుదాం. ఇట్లు, నీ కరెంట్ తీగ'' అని మనోజ్ ట్వీట్ చేశారు.


Also Readటీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి






మా ఆవిడ చెప్పింది కాబట్టి గొడవ పడట్లేదు!
మంచు మనోజ్ శుక్రవారం రాత్రి చేసిన ఒక ట్వీట్ చూస్తే... భార్య భూమా మౌనిక రెడ్డి చెప్పింది కనుక గొడవలు పెట్టుకోవడం లేదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.






విష్ణు శుక్రవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. ''సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ'' అని తండ్రి మోహన్ బాబు 'రౌడీ' సినిమాలో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి బదులుగా ''కన్నప్ప'లో రెబల్ స్టార్ కృష్ణంరాజు లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు'' అని మనోజ్ పేర్కొన్నారు.‌ దాంతో మంచు బ్రదర్స్ గొడవ సోషల్ మీడియాకు ఎక్కింది.


Also Readతండ్రి వర్ధంతికి బాలకృష్ణ ఘన నివాళి... భారతరత్న సాధించి తీరతామన్న ఆర్ఆర్ఆర్