ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మొన్నీమధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో తన సినిమా ‘భీమ్లా నాయక్‌’కు అప్పటి ఏపీ ప్రభుత్వం నుండి సమస్య వచ్చినప్పుడు ఎవరూ స్పందించలేదు. కానీ నేను ఆ విషయాలు మనసులో పెట్టుకోను అన్నారు గుర్తుందా? నిజానికి అదొక్క సందర్భమే కాదు, గతంలో కొణిదెల కుటుంబానికి చాలా సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకునే టాలీవుడ్‌ జనాలు చాలా తక్కువ. 


ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మరోసారి మెగా కుటుంబంలో ఓ హీరో సినిమాకు సమస్య వచ్చింది. అదే పైరసీ. నిజానికి ఆ సమస్య కొత్తేం కాదు. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఈ ఇబ్బంది పడుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో కాస్త ఆ ఎఫెక్ట్‌ తగ్గింది. అలాగే పైరసీ కాపీ నాణ్యత కూడా తగ్గింది. దీంతో థియేటర్లకు వద్దాం అనుకుని డోలాయమానంలో ఉండే జనాలు వచ్చారు, చూశారు. 


ట్విస్ట్‌లు, ప్లాట్‌లు ఎలా?


కానీ ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికి వచ్చేసరికి.. విడుదలైన రోజే హెచ్‌డీ నాణ్యత ఉన్న కాపీ బయటకు వచ్చేసింది. ఇంకా సినిమా విడుదల కాక ముందే సినిమాలోని ట్విస్టులు, ప్లాట్‌లు బయటకు ఇచ్చేశారు. అంటే సినిమా పైరసీ కాపీని అప్పటికే కొందరు చూశారు అని. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. ఇదంతా అర్థం చేసుకున్న సినిమా టీమ్‌, రామ్‌చరణ్‌ పీఆర్‌ టీమ్‌ పైరసీ చేసిన వాళ్ల మీద, సినిమా లీకులు ఇచ్చిన నెటిజన్ల మీద కంప్లైంట్‌లు ఇచ్చింది. 


Also Readఈ వారం టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఫస్ట్ ప్లేస్ ఎవరిది? టాప్ 10లో ఏవేవి ఉన్నాయో తెలుసా?


సినిమాను బస్సుల్లో వేశారని, బహిరంగంగా షాపుల్లో వేశారు అని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ లోగా ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక ప్రాంతంలో ఓ లోకల్‌ ఛానల్‌లో పైరసీ కాపీని ప్రసారం చేశారు అంటూ కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపై చిత్రబృందం ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి తాజాగా ఆ ఛానల్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్లూస్‌ టీమ్‌ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


పెద్ద తలకాయను పట్టుకోవాలి
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం, విచారణ జరిగి, రైడ్‌ చేసి పట్టుకోవడం ఓకే. ఈ విషయంలో ఏపీ పోలీసులు చాలా వేగంగా స్పందించారు కూడా. అయితే ఈ చిన్న తలకాయలు కాదు.. మొత్తం లీక్‌ చేసిన ఆ పెద్ద తలకాయ ఎవరు. ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఎందుకు రావడం లేదు. అంత క్వాలిటీతో సినిమా బయటకు ఎలా వచ్చింది. తెలిసినవాళ్ల పనేనా? అనే డౌట్ వస్తోంది. మరి దీనిపై దిల్‌ రాజు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 


ఇదంతా ఒకెత్తు అయితే ఈ సినిమా పైరసీ విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీ నుండి రామ్‌చరణ్‌కు కానీ, దిల్‌ రాజుకు కానీ సపోర్టు చేస్తే మాట్లాడిన స్టార్లు లేరు. ఎందుకు అంత లైట్‌ తీసుకుంటున్నారు. రేపొద్దున ఇలాంటి సమస్యే మీకూ వస్తే.. ఓసారి ఆలోచించుకోండి.


Also Readసైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...