Happy Birthday CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అంటే ఈ రోజుతో సీఎం కేసీఆర్ ఏడు పదుల వయసులోకి చేరుకుంటారు. ఆయనకు ఇది చాలా కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఓ సామాన్య ఫ్యామిలీలో పుట్టిన కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించి నేషనల్‌ ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళి సై, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 






అలాగే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. గౌరవ నీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వివరించారు. ప్రజా జీవితంలో తనదైన పంథాను కల్గిన కేసీఆర్ గారికి సంతోషకరమైన జీవితం ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్థిగా కోరుటుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈశ్వరుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 






తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు సీఎం కేసీఆర్ కు ఆరోగ్యవంతమైన జీవితాన్ని  ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.