Crime News: సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. జనాలను ఆకట్టుకోవాలని లేని పోని ప్రచారం కోసం ఇద్దరు చేసిన పని హైదరాబాద్‌లో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసింది. హైదరాబాద్ పాత బస్తీలో హెల్మెట్ పెట్టుకోకుండా బుర్ఖా వేసుకుని అమ్మాయిలా రీల్స్ చేసిన యువకులకు పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు. కానీ ఓ నెటిజన్ ఈ రైడింగ్ వీడియోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశాడు. రీల్స్ చేసేందుకు బుర్ఖా వేసుకుని బైక్ నడిపిన ఇద్దరు యువకులకు పోలీసులు అదుపులోనికి తీసుకుని వారికి జరిమానా విధించినట్లు పోస్టులో పేర్కొన్నాడు. అయితే దీనిపై భారీ స్పందన వచ్చింది. కొందరు ఆ యువకుడికి తగిన శాస్తి చేశారని కామెంట్ చేస్తుంటే.. దీంట్లో తప్పేముందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఏముందంటే..
ఓ కళ్లజోడు పెట్టుకున్న యువకుడు బుర్ఖా వేసుకుని బైక్ ర్యాష్ గా నడుపుతుంటే.. వెనక మరో యువకుడు ప్యాంటు షర్టు వేసుకుని కూర్చున్నాడు. దారిలో వారిని అందరూ వింతగా చూడటం, బుర్ఖా వేసుకున్న కొందరు మహిళలు సైతం వారిని ఆశ్చర్యంగా చూడటం వంటివి ఈ రీల్ లో క్యాప్చర్ చేశారు. అలాగే చాలా మంది యువకులు వారిని అనురసరిస్తూ ఎంకరేజ్ చేస్తున్నట్లు చూపించారు. ఓ పాటను ఈ రీల్ కి జతచేశారు.
కామెంట్లు, రీపోస్టులు ఇలా..
ఇలా బుర్ఖా వేసుకుని పరువు తీస్తున్నారంటూ ఓ నెటిజన్ దీన్ని రీ పోస్టు చేశారు. ఇది అసలు నేరం ఎలా అవుతుంది? మగవాళ్లు బుర్ఖా వేసుకోవడం తప్పేం కాదే అని మరి కొందరు ఈ రీల్ ని రీ పోస్టు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోలేదని కదా వాళ్లపై కేసు నమోదు చేయాల్సింది అని కొందరంటుంటే.. ఆడవాళ్లు జీన్స్ ప్యాంటు, టీషర్టు వేసుకుంటే లేని తప్పు మగవాళ్లు బుర్ఖా వేసుకుని బైక్ నడిపితే వచ్చిందా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
అసలు వాళ్లని అరెస్టు చేశారని ప్రూఫ్ ఏమన్నా ఉందా అని ఇంకొందరు అడుగుతున్నారు. పోలీసులు మంచిపని చేశారని , వాళ్లకి థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇవ్వాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది కనిపిస్తుంటే కేవలం ఇద్దరి మీదే కేసు పెట్టడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read: పిడుగులా? బాంబులా? భూకంపమా?- వేకువజామున శబ్దాలకు నిద్రలోంచి లేచి కూర్చున్న హైదరాబాద్ వాసులు
Also Read: తండ్రి భుజంపై ఎక్కి రాఖీ కట్టించుకున్న బాలుడు - గుండెల్ని పిండేసే ఘటన